Whatsapp : నెంబర్ సేవ్ చెయ్యకుండా వాట్సాప్ మెసేజ్ ఇలా చెయ్యండి


ఫోన్ లో బ్రౌజర్ ఓపెన్ చేయాలి

అక్కడ కింద చెప్పినట్టు టైప్ చేస్తే చాలు

మెస్సేజ్ ఆప్షన్ తో వాట్సాప్ తెరుచుకుంటుంది

వాట్సాప్ వాడే వారు కొత్త నంబర్ దేనికి అయినా వాట్సాప్ చేయాలంటే.. కాంటాక్ట్
లిస్ట్ లో యాడ్ చేసుకుని మెస్సేజ్, ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుంటారు. ఇలా
వాట్సాప్ చేయాల్సిన ప్రతీ నంబర్ ను కాంటాక్ట్ లిస్ట్ లో చేర్చుకోవడం వల్ల
జాబితా పెద్దది అయిపోతుంది. కొన్ని నంబర్లను సేవ్ చేసుకోవాల్సిన అవసరం
ఉండకపోవచ్చు. అందుకే దీనికి ఓ పరిష్కారం ఉంది. కొత్త నంబర్, దాన్ని
కాంటాక్టుల జాబితాలో సేవ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండానే.. నేరుగా వాట్సాప్
చేయవచ్చు. అందుకు మార్గాలున్నాయి.

ముందు మీ ఫోన్ లో ఏ బ్రౌజర్ అయినా ఓపెన్ చేయండి. బ్రౌజర్ సెర్చ్ బార్ లేదా
యూఆర్ఎల్ బార్ లో https://wa.me/91 అని
టైప్ చేసి స్పేస్ ఇవ్వకుండా ఫోన్ నంబర్ యాడ్ చేసి సెర్చ్ ఓకే చేయండి. వెంటనే
వాట్సాప్ యాప్ ఓపెన్ అయ్యి సదరు ఫోన్ నంబర్ తో మెస్సేజ్ ఆప్షన్
తెరుచుకుంటుంది. అప్పుడు ఆ నంబర్ కు వాట్సాప్ చేసుకోవచ్చు. ఉదాహరణకు మీరు
8100000000 నంబర్ కు వాట్సాప్ చేయాలని అనుకుంటే..  https://wa.me/91
8100000000 అని టైప్ చేసి సెర్చ్ చేయాల్సి ఉంటుంది.

ALSO READ:  

Flash...   Joshimath crisis: జోషిమఠ్ పట్టణం మునిగిపోవచ్చు...ISRO సంచలన శాటిలైట్ నివేది