ఉపాధ్యాయ బదిలీలు,రేషనలైజేషన్ సమాచారం Dt.07.07.2022

 ఉపాధ్యాయ బదిలీలు,రేషనలైజేషన్ సమాచారం Dt.07.06.2022

విద్యాశాఖ మంత్రి గారితో ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో చర్చించిన అంశాలు :

➧ జి.ఓ. నం.117కు ఈ రోజు లేక రేపు మార్పులు చేసి ఉత్తర్వులు ఇస్తారు

➧  ప్రాథమిక పాఠశాలల్లో 1:20గా చూస్తారు. 21 రోల్ దాటితే 2వ పోస్టు ఇస్తామన్నారు.

➧ ఎల్ఎఫ్ఎల్ హెచ్.ఎం. పోస్టు 150 రోల్ పైన ఉన్న పాఠశాలకు ఇస్తారు.

➧ ఎన్ రోల్ మెంట్ తేదీని 05.05.2022గానే ఉంచారు.

 ➧ హైస్కూల్ లో 2వ హిందీ టీచర్ పోస్టు 10 సెక్షన్ వద్ద ఇస్తారు.

 ➧ ప్రీ హైస్కూల్స్ లో 98 రోల్ పైన ఉన్న చోట 6గురు స్కూల్ అస్టిస్టెంట్లు 1 పిఇటిని ఇస్తారు.

➧ రాష్ట్రంలోని హైస్కూల్స్ లో 998 హెచ్.ఎం. పోస్టులు అప్ గ్రేడేషన్ కోసం ఫైనాన్స్ కి ఫైల్ పెట్టారు.

 ➧ స్కూల్ అసిస్టెంట్  5419 పోస్టులు అప్ గ్రేడేషన్ కోసం ఫైనాన్స్ కి ఫైల్ పెట్టారు.

 ➧ రాష్ట్రంలో 2342 ఎస్.ఏ. పోస్టులు తత్సమాన పోస్టులకు కన్వర్షన్ ఇస్తున్నారు.

➧ అన్ని హైస్కూల్స్ కి హెచ్.ఎం. మరియు పి.డి. పోస్టు ఇస్తారు.

 ➧ అన్ని వసతులున్న చోట మాత్రమే మెర్జింగ్ చేస్తారు.

 ➧ ఏ ఉపాధ్యాయునికి 36 పీరియడ్లు పైబడి ఉండవు.

➧  ప్రభుత్వం నుంచి సిఫార్సు బదిలీలు ఉండవు.

➧ జీరో సర్వీసుతో బదిలీలు చేస్తారు.

➧ కట్ ఆఫ్ డేట్:30:06:2022 జులై నెలాఖరుకు మార్చాలని కోరాము.

 ➧ Maximum sevice:5 years for all cadres, Nc teachers కు కూడా.

➧ హెచ్ఎంలకు తప్ప మిగిలిన అన్ని క్యాడర్లకు 8 సం.లు ఉండాలని కోరాము.

➧ 2021 జనవరిలో transfer అయి ప్రస్తుతం rationalization కు గురయ్యే టీచర్లకు పాత స్టేషన్ పాయింట్స్ ఇస్తారు.

➧ మ్యాపింగ్ వలన ఎఫెక్ట్ అయ్యేవారికి మాత్రమే స్పెషల్ పాయింట్స్ ఇస్తారు. మిగిలిన వారికి రేషనలైజేషన్ పాయింట్లు లేవు

Flash...   బ్రిడ్జి కోర్సు - ఉపాధ్యాయులు హాజరు కావలసిన రోజుల వివరాలు...

➧ Against PD పోస్టులలో పనిచేసే PET లు కూడా బదిలీ చేస్తారు.

➧ హైస్కూల్స్ లో 1:60 కాకుండా 1:45గా ఉండాలని ప్రాతినిధ్యం చేసాం.

➧  అన్ని కేడర్ల వారికి ఆన్ లైన్ లోనే బదిలీలు జరుగుతాయి. 

 ➧ MEO లకు బదిలీలు ఉండవన్నారు

 ➧ సీనియార్టీని స్కూల్ base గా కాకుండా స్టేషన్ base గా (పంచాయతీ) బదిలీలు ఉంటాయి.

➧ ఆన్లైన్ విధానంలో పొరపాటు జరిగితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటారు.

➧ ఓ.హెచ్ .,వి.హెచ్. వారికి 80% ఉంటేనే పరిగణిస్తారు

➧ వినికిడి సమస్యలు ఉన్నవారిని పరిగణించరు

➧ ఉర్దూ మీడియం పాఠశాలలో పనిచేసే తెలుగు ఉపాధ్యాయుల అంశం పరిశీలిస్తామన్నారు

➧ సింగిల్ మీడియా మాత్రమే ఉంటుంది తెలుగు మాధ్యమం ఉండదు అని చెప్పారు

➧ ఎస్జీటీ పోస్టులు అదనంగా ఉన్న పాఠశాలలో బ్లాక్ చేస్తారు.

➧ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అదనంగా ఉన్నప్పటికీ బ్లాక్ చేయరు

➧ సర్ ప్లస్ గా ఉన్న పోస్టులలో 2814 పోస్టులను కర్నూలు జిల్లాకు షిఫ్ట్ చేసి అప్గ్రేడ్ చేస్తారు 

➧ పాతజిల్లాల ప్రాతిపదికన బదిలీలు ఉంటాయి

SOURCE : SOCIAL MEDIA