AP TET అప్‌డేట్: AP TET రాసే అభ్యర్థులకు ముఖ్యమైన సూచన
AP TET కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు ముఖ్యమైన సూచన. ఏపీ టెట్‌కు మొత్తం 5.50 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసుకునేందుకు వెబ్‌సైట్ (CLICK HERE )లో అవకాశం కల్పించారు. పరీక్షా కేంద్రాల ఆప్షన్ లింక్‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అందుకు అభ్యర్థులు ఈ లింక్ పై క్లిక్ చేసి తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ, క్యాప్షా కోడ్ తో లాగిన్ అయితే.. అక్కడ ఈ ఆప్షన్ కనిపిస్తుంది. దాని ద్వారా కేంద్రాన్ని ఎంపిక చేసుకోవచ్చు.
READ: TET & DSC 10500 GENERALL SCIENCE BIT BANK
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది భారీగా దరఖాస్తులు రావడంతో కంప్యూటర్ల కొరత దృష్ట్యా పక్క రాష్ట్రంలో పరీక్షా కేంద్రాలను కేటాయించే అవకాశం ఉంది. ముందుగా ఆప్షన్లు ఇచ్చిన వారికి సొంత జిల్లాలోనే పరీక్ష రాసే అవకాశం ఉంటుంది. ఆలస్యంగా ఇచ్చే వారికి ఇతర జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను కేటాయించే అవకాశం ఉంటుంది. అంతే కాదు ఆంధ్రప్రదేశ్‌తో పాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఒడిశాలో పరీక్షా కేంద్రాలను కేటాయిస్తామని ప్రకటించారు. అందుకే చివరి క్షణం వరకు వేచి చూడకుండా పరీక్షా కేంద్రాల ఆప్షన్లు ఇవ్వాలని అధికారులు సూచించారు.
READ: AP TET SYLLABUS ANALYSIS….
ఆంధ్రప్రదేశ్ లోనూ టెట్ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. టెట్ కోసం జూన్ 15 నుంచి జూలై 15 వరకు దరఖాస్తు రుసుమును అనుమతించగా.. జూన్ 16 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించారు.
టెట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు పేపర్ 1ఎ, పేపర్ 1బి, పేపర్ 2ఎ మరియు 2బి కింద ఈ పరీక్షలు ఉంటాయి. సీబీటీ విధానంలో ఈ పరీక్షలు ఆగస్టు 6 నుంచి ఆగస్టు 21 వరకు నిర్వహించనున్నారు. అర్హత సాధించాలంటే జనరల్ అభ్యర్థులు 60 శాతం, బీసీ అభ్యర్థులు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులు 40 శాతం మార్కులు పొందాలి. డీఎస్సీలో అర్హత సాధించిన వారికి 20 శాతం వెయిటేజీ ఇస్తారు. ఒక్కసారి ఈ టెట్ అర్హత సాధిస్తే గతంలో దీని వాలిడిటీ ఏడేళ్లు ఉండగా.. ఇప్పుడు ఏఐసీటీఈ దాన్ని జీవితకాలంగా మార్చింది.
షెడ్యూల్ ప్రకారమే టెట్ పరీక్షలు జరుగుతాయని అధికారులు స్పష్టం చేశారు. ఈ నెల 25 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపిన అధికారులు.. ఆగస్టు 31న టెట్ ప్రిలిమినరీ కీ, సెప్టెంబర్ 12న ఫైనల్ కీ విడుదల చేస్తామని, తుది ఫలితాలు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. సెప్టెంబర్ 14.
ALSO READ: