EPFO: PF ఖాతాదారులకు శుభవార్త.. అకౌంట్లలోకి రూ.48 వేలు?

 EPFO: PF ఖాతాదారులకు శుభవార్త.. అకౌంట్లలోకి రూ.48 వేలు?


ఈ వార్త ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (epfo) ఖాతాదారులకు శుభవార్తగా చెప్పవచ్చు. పీఎఫ్ అకౌంట్ కలిగిన వారికి కేంద్ర ప్రభుత్వం వడ్డీని చెల్లించనుంది. వెలువడుతున్న నివేదికల ప్రకారం.. త్వరలోనే ప్రభుత్వం వడ్డీ డబ్బులను ఈపీఎఫ్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రతి ఏడాది వడ్డీ చెల్లిస్తున్నప్పటికీ.. ఏడాది ఆఖరు వరకు వేచిచూసేది. అయితే ఈసారి కాస్త ముందుగానే వడ్డీని చెల్లించాలని ఈపీఎఫ్ఓ భావిస్తున్నట్లు సమాచారం. ఈ నిర్ణయం వల్ల దాదాపు 6 కోట్ల మందికి ప్రయోజనం చేకూరనుంది.

2019 – 20 ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రేటు 8.5 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డు మార్చి నెలలోనే పీఎఫ్ వడ్డీ రేటును 8.5 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గించింది. ఇది ప్రతికూల అంశమనే చెప్పుకోవచ్చు. తక్కువ వడ్డీ వస్తుంది. ఈ వడ్డీ డబ్బులు త్వరలోనే ఈపీఎఫ్ ఖాతాల్లో జమ కానుంది.

ఎంత వడ్డీ డబ్బులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. పీఎఫ్ ఖాతాలోని డబ్బులు ప్రాతిపదికన మీకు వచ్చే వడ్డీ డబ్బులు కూడా నిర్ణయమౌతాయి. ఉదాహరణకు మీ అకౌంట్‌లో రూ. 6 లక్షలు ఉంటే.. ప్రస్తుత వడ్డీ రేటును అనుసరించి.. మీకు వడ్డీ రూపంలో రూ. 48 వేలు లభిస్తాయి. అయితే.. వడ్డీ రేట్లపై ప్రభుత్వ ప్రకటన వచ్చేంత వరకు ఏదీ తుది నిర్ణయం కాదు. సెంట్రల్ బోర్డు వడ్డీ రేటు ప్రతిపాదనలను ముందుగా ఆర్థిక మంత్రిత్వశాఖ ఆమోదించాల్సి ఉంది.

మీ PF ఖాతా లో ఉన్న బాలన్స్ ఎంతో  తెలుసుకోండి

పీఎఫ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలి?

పీఎఫ్ అకౌంట్ లో ఎంత డబ్బు ఉందో తెలుసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి.

ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌కు వెళ్లి యూఏఎన్, పాస్‌వర్డ్ సాయంతో లాగిన్ అయ్యి పీఎఫ్ బ్యాలెన్స్ చూసుకోవచ్చు.

లేదంటే ఎస్ఎంఎస్ ద్వారా బ్యాలెన్స్ తెలుసుకోవాలని చూస్తే.. ఈపీఎఫ్‌వో యూఏఎన్ ఎల్ఏఎన్ అని టైప్ చేసి 7738299899 నెంబర్‌కు మెసేజ్ పంపాలి.

Flash...   Pulsar ns125 : పల్సర్ బైక్ ఇప్పుడు సరికొత్త వేరియెంట్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు.. ధర కూడా తక్కువే..?

ఉమాంగ్ యాప్ ద్వారా కూడా మీకు బ్యాలెన్స్ ఎంతనో తెలుసుకోవచ్చు.

EPF ఖాతాకు సంబంధించిన వివరాలు MISS CALL ఇలా తెలుసుకోండి

ఇందుకోసం మీరు గూగుల్ ప్లేస్టోర్ నుంచి మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉమాంగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. రిజిస్టర్ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వాలి. ఇప్పుడు ఈపీఎఫ్‌వో సర్వీసుల్లోకి వెళ్లాలి. ఇక్కడ మీకు వ్యూ పాస్‌ బుక్ ఆప్షన్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేసి బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.

ఇలా మీరు పీఎఫ్ అకౌంట్‌లో ఎంత బ్యాలెన్స్ ఉందో సులభంగానే చెక్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చాలా వరకు సంస్థలలో ఉద్యోగులు పీఎఫ్ బ్యాలెన్స్ చూసుకోవచ్చు. కానీ కొన్ని ట్రస్ట్‌లు, సంస్థలు బ్యాలెన్స్‌ను ఇలా చెక్ చేసుకోలేవు. ఈ విషయంపై మీ అభిప్రాయాలను, సందేహాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ALSO READ: APGLI వారి అఫిషియల్ ఫైనల్ పేమెంట్ కాలిక్యులేటర్ అందుబాటులో కలదు