Heavy Rains in AP : ఏపీలో భారీ వర్ష సూచన – అప్రమత్తం – రాష్ట్రస్ధాయి కంట్రోల్ రూమ్ ఏర్పాటు

Heavy Rains in AP: లో భారీ వర్ష సూచన – ప్రభుత్వ హెచ్చరిక – రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూమ్ ఏర్పాటు. 

నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా అన్ని చోట్లా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించింది. భారీ వర్షాల నేపథ్యంలో పలు చర్యలు తీసుకుంటున్నారు.

నైరుతి రుతుపవనాల తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో నేడు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఏపీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఆర్గనైజేషన్‌లో స్టేట్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూమ్ నుంచి భారీ వర్షాలు, వరదలను పర్యవేక్షిస్తారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో భారీ వర్షాలు, వరదలు వచ్చే అవకాశం ఉన్నందున ఏపీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఆర్గనైజేషన్ ఈ మేరకు అప్రమత్తమైంది. జిల్లాల్లోనూ అధికారులు కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని సూచించారు. దీంతో తీరప్రాంతాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

తమ ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరద ప్రభావం ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వాలని వాతావరణ శాఖ ప్రజలకు సూచించింది. 24 గంటలూ అందుబాటులో ఉండే స్టేట్ కంట్రోల్ రూం ఫోన్ నంబర్లు 1070, 18004250101, 08632377118 వివరాలు తెలియజేయాలని చెప్పారు. రాష్ట్రానికి భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఎండీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అన్నారు.

weather live update here

Flash...   Four Day Week: కొత్త చట్టాలు అమలైతే 4 రోజులు పని.. 3 రోజులు లీవు