INCOME TAX ITR FILING: సైట్ పని తీరు ఇలా ఉంటె… గడువు పొడిగించకపోతే ఎలా..?

INCOME TAX ITR FILING: సైట్ పని తీరు ఇలా ఉంటె… గడువు పొడిగించకపోతే ఎలా..?


ఇంటర్నెట్ డెస్క్: గత ఆర్థిక సంవత్సరానికి (2021-22) ఆదాయపు పన్ను రిటర్న్‌ల దాఖలుకు గడువు జూలై 31 అని కేంద్రం ప్రకటించింది.దీనిని ఇప్పటి వరకు పొడిగించే ఆలోచన లేదని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ శుక్రవారం స్పష్టం చేశారు. అయితే దీనిపై పన్ను చెల్లింపుదారుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఇన్ కమ్ ట్యాక్స్ వెబ్ సైట్ ఎలాంటి ఒత్తిడినైనా తట్టుకోగలదని తరుణ్ బజాజ్ చెప్పగా.. వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ మేరకు తమకు ఎదురైన అసౌకర్యాన్ని స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేస్తున్నారు. #Extend_Due_Dates_Immediately అనే హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది.

కొత్తగా ప్రవేశపెట్టిన ఈ ఫైలింగ్ పోర్టల్ సరిగా పనిచేయడం లేదని చాలా మంది తమ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఐటీఆర్-3 ఫైల్ చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఓ యూజర్ పోస్ట్ చేయగా, ఐటీ శాఖ బదులిచ్చి ఆ వివరాలను తమతో పంచుకోవాలని సూచించింది. కొత్త ఐటీ పోర్టల్ లోడ్ అవుతుందని మరో యూజర్ పేర్కొన్నారు. ఓటీపీ ధ్రువీకరణ జరిగిన గంట తర్వాత కూడా ప్రక్రియ పూర్తి కాలేదని మరో వినియోగదారు రాశారు. ఒకవైపు ఇన్ని సమస్యలు ఉంటే గడువు పెంచేది లేదని చెప్పడం సరికాదని, అయితే గడువు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో కోవిడ్ కారణంగా కేంద్రం వరుసగా రెండేళ్లు గడువును పొడిగించిన సంగతి తెలిసిందే.

INCOMETAX PORTAL FOR e-filing

Flash...   CARONA టైంలో మన ఆరోగ్యాన్ని కాపాడేవి ఇవే!