JEE MAIN: జేఈఈ మెయిన్‌ రెండో విడత పరీక్షలు వాయిదా

 


హైదరాబాద్‌: రేపట్నుంచి (JULY 21 )జరగాల్సిన జేఈఈ మెయిన్‌ రెండో విడత పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు జాతీయ పరీక్షల మండలి (NTA) తెలిపింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం.. రెండో విడత పరీక్షలు జులై 21న ప్రారంభమై 30న ముగియాల్సి ఉంది. అయితే, వాయిదా పడ్డ పరీక్షలు జులై 25 నుంచి ప్రారంభమవుతాయని ఎన్‌టీఏ బుధవారం వెల్లడించింది. పరీక్షలకు సంబంధించి రేపట్నుంచి వెబ్‌సైట్‌లో అడ్మిట్‌ కార్డులు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. పరీక్ష వాయిదాకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. కాగా.. జేఈఈ మెయిన్‌​ తొలి విడత పరీక్షలు జూన్ 23 నుంచి 29 వరకు నిర్వహించగా.. ఫలితాలను జులై 11న ప్రకటించిన విషయం తెలిసిందే.
 

Flash...   భారత్‌ గెలిస్తే 100 కోట్లు పంచుతా! కంపెనీ CEO బంపర్‌ ఆఫర్‌ !