LPG గ్యాస్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయో తెలుసా?

All you wanted to know about LPG pricing formula

దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ఎల్పీజీ సిలిండర్ల ధరలు భారీగా పెరుగుతున్నాయి. తెలంగాణలో ఎల్పీజీ సిలిండర్ రూ.1105కి చేరింది. జూలై 1న 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.183.50 తగ్గినప్పటికీ.. కేవలం 5 రోజుల్లోనే దేశీయ గ్యాస్ సిలిండర్ ధరలను చమురు కంపెనీలు పెంచడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తాజా పెంపుతో చాలా రాష్ట్రాల్లో రూ.1040, రూ.1053కి విక్రయిస్తున్నారు. LPG సిలిండర్లపై పన్ను వల్ల రేట్లు పెరుగుతున్నాయని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇది నిజామా? ఒక్కో రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ ధరలు ఎందుకు భిన్నంగా ఉంటాయి? అసలు సిలిండర్ ధరలు ఎలా నిర్ణయిస్తారు? మీరు ఎప్పుడైనా అనుమానించారా?

రాష్ట్రాలలో గ్యాస్ ధరలు ఎందుకు మారుతున్నాయి?

ఎల్పీజీ సిలిండర్లపై విధించే పన్నులో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వాలకే చెందుతుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇది నిజం కాదు. గ్యాస్ సిలిండర్ ధర జీఎస్టీ పరిధిలోకి వస్తుంది. దేశవ్యాప్తంగా LPG సిలిండర్లపై ఒకే పన్ను ఉంది. పన్నుల ద్వారా వచ్చే సొమ్మును కేంద్రం, రాష్ట్రాలు సమానంగా పంచుకుంటాయి. పెట్రోల్ ధరలపై వ్యాట్ విధించినందున, . సిలిండర్లపై 5 శాతం GST విధిస్తారు. దీనిలో  2.5 శాతం కేంద్రానికి, 2.5 శాతం రాష్ట్రాలకు అందుతాయి. మరి ధరల్లో మార్పులు ఎలా ఉంటాయో.. కమీషన్, ఎస్టాబ్లిష్ మెంట్ ఛార్జీలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటాయి. ఇవి రాష్ట్ర భౌగోళిక పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. అలాగే రవాణా ఛార్జీలు కూడా వివిధ కారణాల వల్ల రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఈ ఛార్జీలన్నీ ఒక్కో రాష్ట్రానికి భిన్నంగా ఉంటాయి. అందుకే దేశవ్యాప్తంగా సిలిండర్ ధరలు ఒకేలా లేవు.

సిలిండర్ రేట్లు ఎలా నిర్ణయించబడతాయి?

మన దేశంలో LPG సిలిండర్ ధరను నిర్ణయించడంలో రెండు అంశాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. మొదటి కారణం డాలర్‌తో రూపాయి మారకం విలువ, రెండోది అంతర్జాతీయ బెంచ్‌మార్క్ రేటు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఎల్‌పిజి ధర పెరిగి రూపాయి బలహీనపడినప్పుడు దేశీయ మార్కెట్‌లో ఎల్‌పిజి ధర పెరుగుతుంది. కానీ దురదృష్టవశాత్తు.. ఈ రెండు అంశాలు ఏకకాలంలో మన దేశంలో సిలిండర్ల ధర పెరగడానికి కారణమయ్యాయి. అందుకే గ్యాస్ బండ సామాన్యుడి నెత్తిపై గుదిబండలా  వ్యవహరిస్తోంది.

Flash...   Lamborghini Revuelto: గంటకు 350 కి మీ వేగం.. లాంబోర్గినీ కొత్త కార్ ధర ఊహించగలరా ..!