Post Office Jobs: పది పాసైన వారికి పోస్టాఫీసులో నెలకి 56 వేల తో ఉద్యోగాలు..
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన వారికి ఇండియా పోస్ట్‌లో ఉద్యోగాలున్నాయి. జీతం 56 వేల వరకూ వస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పోస్టాఫీస్ లో ఉద్యోగాల కోసం ఇండియా పోస్ట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పోస్టాఫీసులో భవిష్యత్ నిర్మించుకునేందుకు నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం. పే మెట్రిక్స్ లెవెల్ 2లో స్టాఫ్ కారు డ్రైవర్ పోస్టులు 2 ఖాళీలున్నాయి. ఇండియా పోస్ట్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ప్రకారం ఈ పోస్టులకు దరఖాస్తును ఆన్ లైన్ చేసుకోవాలి. ఇండియా పోస్ట్ అధికారిక వెబ్‌సైట్ indiapost.gov.in లో ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి
మోటార్ మెకానిజంపై పూర్తి అవగాహన ఉండాలి. దాంతో పాటు..లైట్ మోటార్ వాహనాల డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు.. హెవీ మోటార్ వాహనాల డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి
కనీసం మూడేళ్లపాటు లైట్ అండ్ హెవీ మోటార్ వాహనాలు నడిపే అనుభవముండాలి. వాహనానికి చిన్న చిన్న సమస్యలు ఏమైనా వస్తే.. వాటిని బాగు చేసే నైపుణ్యతను కలిగా ఉండాలి.
విద్యార్హత విషయానికి వస్తే.. గుర్తింపు పొందిన బోర్టు నుంచి పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధుల వయస్సు 56 ఏళ్ల కంటే ఎక్కువ ఉండకూడదుదీనిలో ఉద్యోగం సాధించిన అభ్యర్థులు హర్యానా రాష్ట్రంలోని రోహ్‌తక్, హిసార్‌లో పోస్టింగ్ ఉంటుంది. తర్వాత బదిలీల ప్రకారం ఎక్కడైనా పోస్టింగ్ వేసే అవకాశం ఉంటుంది. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి రిజర్వేషన్లు వర్తించవని పేర్కొన్నారు
ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్ తో పాటు.. విద్యార్హత సర్టిఫికేట్లను
The Assistant Director
Postal Services(Staff)
O/o the Chief Postmaster General,
Haryana Circle,
The Mail, Ambala Cant–133001 చిరునామాకు పంపించాల్సి ఉంటుంది.