SBI Whatsapp: SBI కస్టమర్లకు శుభవార్త.. WhatsApp ద్వారా SBI బ్యాంక్ సేవలు.. ఈ steps అనుసరించండి..
SBI WHATSAPP BANKING: అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన వినియోగదారుల కోసం కొత్త సేవలను ప్రారంభించింది. వాట్సాప్ ద్వారా బ్యాంకు సేవలు అందించనున్నారు. ఇక నుంచి వినియోగదారులు వాట్సాప్ ద్వారా బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్‌మెంట్లను పొందవచ్చు. వినియోగదారులు ఈ సేవలను ఎలా పొందగలరు? ఇలాంటి పూర్తి వివరాలు మీకోసం..
# Mini Statement and Balance Enquiry through Whatsapp Banking
WhatsApp సేవలను పొందేందుకు, వినియోగదారులు ముందుగా నమోదు చేసుకోవాలి. దీని కోసం Registered Mobile Number నుండి WAREG అని టైప్ చేసి, Space ఇచ్చి, Account Number Type చేసి, 72089 33148 కి సందేశం పంపండి. మీ మొబైల్ నంబర్ SBI బ్యాంక్‌లో నమోదు చేయబడాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత వాట్సాప్ నుండి +91 90226 90226 కు Hi అని వాట్సాప్ సందేశం పంపండి. ఇలా చేసిన తర్వాత చాట్ బాక్స్‌లో ఖాతా బ్యాలెన్స్, మినీ స్టేట్‌మెంట్ మరియు వాట్సాప్ బ్యాంకింగ్ సేవల రద్దు అనే మూడు ఆప్షన్‌లు కనిపిస్తాయి. వీటిలో అవసరమైన ఆప్షన్‌ని ఎంచుకుని నంబర్‌ను టైప్ చేసి ఎంటర్ చేయాలి.
HOW TO SEND MESSAGE TO SBI WHATSAPP
CLICK THSI LINK DIRECTLY https://wa.me/+91 90226 90226 and send Hi