Super Buck Moon 2022: ఆకాశంలో మరో అద్భుతం.. త్వరలో సూపర్ మూన్.. ఎప్పుడంటే..

Super Buck Moon 2022: 


సూపర్ మూన్.. అవును సూపర్ మూన్.. ఆకాశంలో అద్భుతం. ఓ వైపు భారీ వర్షాలు.. వరదలు బీభత్సం సృష్టిస్తుండగా.. ఇప్పుడు ఈ అంశం కొత్త చర్చకు దారి తీసింది. అంతేకాదు ఆకాశంలో కనిపించిన ఈ అద్భుతానికి వరదలకూ సైంటిఫిక్ సంబంధం ఉందనే పుకార్లు వినిపిస్తున్నాయి. రేపు గురువారం రాత్రి ఈ సూపర్ మూన్ ఆకాశంలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది అతిపెద్ద చందమామ.. ఆకాశంలో అద్భుతంలా ఆవిష్కృతం కానుంది. ప్రతి పౌర్ణమికి చంద్రుడు నిండుగా కనిపిస్తాడు. అయితే ఈసారి ఓ చిన్న అద్భుతం జరగనుంది. అంతేకాదు ఈ పౌర్ణమి ప్రభావం సముద్రం మీద ఎక్కువగానే పడినట్లు తెలుస్తోంది. గురుత్వాకర్షణ శక్తి వల్ల.. వానల వరదను కూడా సముద్రం తనలో కలవనివ్వదు. దీంతో అలలు ఎగిసిపడుతున్నాయి.. వరద నీరు మళ్లీ వచ్చి చేరుతోంది. దీంతో ముంపు గ్రామాలు మరింత ముంపునకు గురవుతున్నాయి.

టీచర్ డైరీ : అన్ని సబ్జెక్టులకు ఈజీ గా ప్రింట్ తీసుకొనుటకు  తయారు చేయబడిన టీచర్ డైరీ డౌన్లోడ్ చేసుకోగలరు 

ఓవైపు అద్భుత దృశ్యాన్ని భూమి చూస్తోందన్న ఆనందం ఓ వైపు.. ఈ ప్రభావంతో వరద నీరు సముద్రంలో కలవకుండా అల్లకల్లోలంగా ఉంది. ఈ ప్రభావం ఏ మేరకు ఉంటుందో తెలియదు. సముద్రంలో ఈ అలల వయస్సు గురించి కూడా అనిశ్చితి ఉంది. గురుత్వాకర్షణ శక్తి వల్ల.. సముద్రం నీటిని తనలోకి తీసుకోదు.. కానీ నీరు రివర్స్‌లో వెనక్కి నెట్టడం ముంపు గ్రామాలను భయాందోళనకు గురి చేస్తోంది. సముద్రంలోకి వెళ్లే వరద.. ఈ గ్రావిటీ కారణంగా.. వెనక్కి తిరుగుతోంది.

అసలేంటీ ఈ సూపర్‌ మూన్‌? ఆకాశంలో బయటపడే ఈ వింతకు కారణం ఏమిటి?  చంద్రుడు భూమికి అతి దగ్గరగా రావడమే ఈ సూపర్ మూన్ కి కారణం. చంద్రుడు తన కక్ష్యలో భూమి చుట్టూ తిరుగుతున్నందున భూమికి చాలా దగ్గరగా వస్తాడు. ఫలితంగా, చంద్రుడు సాధారణ పౌర్ణమి రోజులలో కంటే పెద్దగా కనిపిస్తాడు. పౌర్ణమి రోజుల్లో కనిపించే పరిమాణం కంటే చంద్రుడు 17 శాతం పెద్దగా కనిపిస్తాడు.

Flash...   గీజర్ కొనాలని అనుకుంటే ? - ఈ బెస్ట్ మోడల్స్ పై ఓ లుక్కేయండి!

HIGH SCHOOL తరగతి వారి ( CLASS 6-10 ) సబ్జెక్టు వారి మోడల్  LESSON PLANS

మళ్లీ ఎప్పుడు..

అయితే సాధారణంగా పౌర్ణమి రోజున సూపర్‌మూన్‌లు వస్తాయి. అయితే, అన్ని పౌర్ణమి రోజుల్లో సూపర్ మూన్ ఉండదు. చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చినప్పుడు సూపర్ మూన్ ఏర్పడుతుంది. తాజాగా జూన్ 14న కూడా సూపర్ మూన్ ఏర్పడింది.అయితే అప్పుడు చందమామ స్ట్రాబెర్రీ రంగులో కనిపించింది. ఏడాదికి మూడు లేదా నాలుగు సార్లు సూపర్‌మూన్‌లు సంభవిస్తాయి. ఖగోళ శాస్త్రవేత్తలు మొదటిసారిగా సూపర్‌మూన్ అనే పదాన్ని 1979 లో ఉపయోగించారు. మళ్లీ 2023లో, జూలై 3న ఈ రకమైన సూపర్ మూన్ కనిపిస్తుందని అంచనా వేయబడింది. ఈరోజు జరిగే మరో అద్భుతం ఏమిటంటే, సూపర్ మూన్ ఏర్పడినప్పుడు, భూమికి మధ్య దూరం సూర్యుడు బాగా పెరుగుతుంది. సాధారణంగా, భూమి మరియు ఆకాశం మధ్య దూరం 152.1 మిలియన్ కిలోమీటర్లు, ఇది 1.67 శాతం ఎక్కువ. అయితే ఈ సూపర్ మూన్ జులై 13న కనిపిస్తుందని.. మధ్యాహ్నం 2.38 గంటలకు అద్భుతం కనిపిస్తుందని నాసా తెలిపింది. అంటే.. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి 12.08 గంటలకు అంటే జూలై 14వ తేదీ.

ALSO READ: 

1. TEXT BOOKS: 1 నుచి 10 తరగతుల SCERT వారి TEXTBOOKS DOWNLAOD

2. అమెజాన్‌లో అద్భుతమైన ఆఫర్లు .. వీటి పై 75 శాతం డిస్కౌంట్‌.. 

3. మరో పిడుగులాంటి వార్త .. బంగాళాఖాతంలో అల్పపీడనం