JIO Independence Day OFFER: రిలయన్స్ జియో స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్

Jio Independence Day 2022 Offer launched

రూ.2,999 రీచార్జ్ తో రోజూ 2.5 జీబీ ఉచిత డేటా

దీనికి అదనంగా 75 జీబీ డేటా ఉచితం

ఉచితంగా ఏడాది పాటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్

రూ.2999తో రీఛార్జి చేసుకునే జియో ప్రీపెయిడ్ వినియోగదారులకు 365 రోజులు వ్యాలిడిటీ లభిస్తుంది. అన్ లిమిటెడ్ కాల్స్, 100 sms లతో పాటు రోజుకు 2.5 జీబీ డేటా చొప్పున మొత్తం 912.5 జీబీ డేటా లభిస్తుంది. ఏడాది పాటు డిస్నీ + హాట్ స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ కూడా పొందొచ్చు. వీటితో పాటు రూ. 750 చొప్పున అజియో, నెట్ మెడ్స్, ఇక్సీగో కూపన్లను అందిస్తోంది. రూ. 750 విలువైన 75జీబీ అదనపు డేటాను సైతం జియో తన యూజర్లకు ఇస్తోంది. ఆన్లైన్ లేదా ఆన్లైన్ ద్వారా రీఛార్జిపై ఈ ప్రయోజనాలను పొందొచ్చు. రీఛార్జి చేసిన 72 గంటల్లో మైజియో యాప్ లో ఈ కూపన్లు కనిపిస్తాయి.


75జీబీ అదనపు డేటాను వినియోగదారుడు తనకు అవసరం అయినప్పుడు వాడుకోవచ్చు. నెట్‌మెడ్స్, అజియో, ఇక్సిగో కూపన్లను ఆయా వేదికలపై నిర్దేశిత మొత్తంలో కొనుగోళ్లపై రిడీమ్ చేసుకోవచ్చు. ఇప్పటికే జియో రెండు లాంగ్ టర్మ్ ప్లాన్లను అందిస్తోంది. రూ. 2879, రూ. 2545 ప్లాన్లను కొంతకాలంగా కొనసాగిస్తోంది. రూ. 2879 ప్లాన్ పై 2జీబీ రోజువారీ డేటాతో పాటు జియో యాప్స్ ను ఉచితంగా అందిస్తోంది. రూ. 2545 రీఛార్జి పై 336 రోజుల వ్యాలిడిటీతో 1.5జీబీ చొప్పున డేటా అందిస్తోంది. ఈ రెండు ప్లాన్లకు డిస్నీ + హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ ఉండదు.

ఈ ప్లాన్ తీసుకున్న వారికి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఏడాది సబ్ స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. విడిగా ఈ ప్లాన్ తీసుకోవాలంటే రూ.499 అవుతుంది. వీటికి అదనంగా రూ.750 విలువైన అజియో కూపన్, నెట్ మెడ్స్, ఇక్సిగో డిస్కౌంట్ ఆఫర్లు కూడా లభిస్తాయి. 

Flash...   COLLECTORS STRICT PROCEEDINGS ON SSC EXAMS : WG

రూ.2,879 వార్షిక ప్లాన్ రీచార్జ్ చేసుకుంటే రోజువారీగా 2జీబీ డేటా లభిస్తుంది. 100 ఎస్ఎంఎస్ లు ఉచితం. కాల్స్ కూడా అపరిమితంగా చేసుకోవచ్చు. ఇందులో డిస్నీ హాట్ స్టార్ ప్రయోజనం ఉండదు. రూ.2,545 ప్లాన్ వ్యాలిడిటీ 336 రోజులు. రోజువారీ 1.5జీబీ డేటా ఉచితం. వాయిస్ కాల్స్ కూడా ఉచితం. రోజువారీ 100 ఎస్ఎంఎస్ లు కూడా ఉచితమే.

BROWS FOR JIO OFFERS