Power Cuts For Telugu States : తెలుగు రాష్ట్రాలకు కరెంట్ కట్?

 Power Cuts For Telugu States : తెలుగు రాష్ట్రాలకు కరెంట్ కట్?

 

Power Cuts For Telugu States : తెలుగు రాష్ట్రాలకు విద్యుత్ గండం పొంచి ఉందా? ఏపీ, తెలంగాణకు కరెంట్ కట్ కానుందా? అంటే, అవుననే సమాధానం వస్తోంది. ఈ అర్థరాత్రి నుంచి ఎక్స్ చేంజ్ లలో విద్యుత్ కొనుగోలు నిలిచిపోనుంది.

కేంద్రం ఆంక్షలతో ఏపీ, తెలంగాణకు పొంచి ఉన్న విద్యుత్ గండం?

విద్యుత్ బకాయిల కారణంగా 11 రాష్ట్రాలకు అమ్మకం నిలిపివేయాలని కేంద్రం ఆదేశించింది. దీంతో ఇబ్బందులు ఏర్పడనున్నాయి. అవసరాలను బట్టి తెలంగాణ డిస్కమ్ లు రోజూ 5 నుంచి 10 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను కొనుగోలు చేస్తున్నాయి. అయితే ఇప్పుడు కేంద్రం ఆదేశాలతో విద్యుత్ కొనుగోలుకు ఆటంకం ఏర్పడనుంది. తెలంగాణ నుంచి రూ.1300 కోట్లకుపైగా చెల్లించాలని, ఏపీ డిస్కమ్ ల నుంచి రూ.400 కోట్లకుపైగా బకాయిలు రావాలని కేంద్రం చెబుతోంది.

కేంద్రం ఆదేశాలతో ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడు, కర్నాటక, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్, జమ్ముకశ్మీర్, రాజస్తాన్, మణిపూర్, మిజోరం రాష్ట్రాలకు విద్యుత్ గండం పొంచి ఉంది. 13 రాష్ట్రాల నుంచి రూ.5వేల కోట్ల బకాయిలు ఉన్నట్టు కేంద్రం తెలిపింది.

తెలంగాణ రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు తెలంగాణలోని విద్యుత్ సంస్థలు సెంట్రల్ ఎక్స్ చేంజ్ ద్వారా వివిధ రాష్ట్రాల నుంచి రోజుకు 5 నుంచి 10 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు చేస్తుంది. కాగా, బకాయిలు చెల్లించని కారణంగా ఎక్స్ చేంజ్ ల ద్వారా తెలంగాణ రాష్ట్రం కొనుగోలు చేస్తున్న విద్యుత్ ను నిలిపివేస్తామని కేంద్రం ప్రకటించింది. కేంద్రం ఆదేశాలతో తెలంగాణ విద్యుత్ సంస్థలు అలర్ట్ అయ్యాయి. కేంద్రం ఆంక్షలతో ఇప్పటికిప్పుడు విద్యుత్ అంతరాయానికి ఇబ్బందులు కలగకపోయినప్పటికి.. రానున్న రోజుల్లో ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

ALSO READ: 

PROMOTION QUALIFICAITONS REVISED TO POST OF SA /GR-II HM

Flash...   Delhi High Court:నెలకి రూ 1,36,000 జీతంతో జ్యుడీషియల్ సర్వీస్ లో ఉద్యోగాలు .. అప్లై చేయండి

FACIAL ATTENDANCE : ప్రభుత్వం మొండికేస్తే యాప్ డౌన్

అన్ని ప్రభుత్వకార్యాలయ్యాల్లోనూ ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా అటెండెన్సు