Whatspp: సైలెంట్ గా కొత్త ఫీచర్ తీసుకొచ్చిన వాట్సాప్.. మీ యాప్‌లో ఈ తేడాను గమనించారా.?
Whatspp new feature: స్మార్ట్‌ఫోన్‌లు వాడుతున్న వారికి వాట్సాప్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతున్న వాట్సాప్ రోజురోజుకూ వినియోగదారుల సంఖ్యను పెంచుకుంటోంది. పెరుగుతున్న పోటీని తట్టుకునేందుకు కొత్త ఫీచర్లను తీసుకొచ్చి వినియోగదారులను దూరం చేసుకోకుండా చేస్తోంది. ఇప్పటికే పలు ఆసక్తికర ఫీచర్లను పరిచయం చేసిన ఈ మెసేజింగ్ యాప్ తాజాగా ఎలాంటి హంగామా లేకుండా మరో కొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఫీచర్ ఇప్పటికే వాట్సాప్ యాప్‌కు జోడించబడింది. యాప్‌లో ఈ కొత్త మార్పును చాలా మంది గమనించి ఉండకపోవచ్చు.
READ: NON ANDROID BASIC MODEL PHONES
మొన్నటి వరకు వాట్సాప్ ఓపెన్ చేయగానే పైన చాట్స్, స్టేటస్, కాల్స్ అనే మూడు ఆప్షన్లు కనిపించేవి. అయితే ఇప్పుడు వాటితోపాటు కెమెరా ఐకాన్ కూడా కనిపిస్తుంది. ఒకసారి చెక్ చేయండి. అది కనిపించిందా? కాబట్టి ఈ ఫీచర్ ఉపయోగకరంగా ఉందా అని మీరు అనుమానిస్తున్నారు. ఈ కెమెరా చిహ్నాన్ని క్లిక్ చేయడం ద్వారా కెమెరా వెంటనే తెరవబడుతుంది. దీనితో, మీరు ఫోటోను క్లిక్ చేసి, మీకు నచ్చిన వారికి సందేశాన్ని పంపవచ్చు లేదా స్టేటస్‌గా సెట్ చేయవచ్చు.
READ: Google Pay , Phone Pe వినియోగదారులకు బిగ్ షాక్.. సిద్ధంగా ఉండండి!
ఇప్పటి వరకు ఎవరికి ఫోటో పంపాలనుకుంటున్నారో వారి చాట్ పేజీని ఓపెన్ చేసి కెమెరాపై క్లిక్ చేసే అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు ఇంట్లోనే కెమెరా ఆప్షన్ తీసుకొచ్చింది. ఈ ఫీచర్ గతంలో iOS వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే ఇప్పుడు ఆండ్రాయిడ్ డివైజ్‌లలో కూడా ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టారు.
ALSO READ: