AP Weather: ఏపీలో 3 రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు.. ముఖ్యంగా ఈ జిల్లాల్లో

 AP Weather: ఏపీలో 3 రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు.. ముఖ్యంగా ఈ జిల్లాల్లో


Andhra Rains: ఏపీ ప్రజలకు అలెర్ట్. భారీ వర్షసూచన వచ్చేసింది. తూర్పు మధ్య, దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడిందని భారత వాతావరణ శాఖ తెలిపింది.  దీని వలన రాగల 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ క్రమంలో బుధవారం రాత్రి నుంచి రెండు రోజులు రాష్ట్రంలో విసృతంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటన విడదల చేసింది. 

పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా పడే అవకాశం ఉందని.. వర్షం కురుస్తున్న సమయంలో జనాలు చెట్ల కింద నిలబడవద్దని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ముఖ్యంగా పశ్చిమగోదావరి(West Godavari), తూర్పుగోదావరి(East godavari), విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని అధికారులు సూచించారు. ఒకవేళ ఇప్పటికే వెళ్లి ఉంటే..  వెంటనే వెనక్కి తిరిగి రావాలన్నారు. తీరం వెంబడి భారీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

ALSO READ:

GPS OPS CPS ల మధ్య ప్రధాన వ్యత్యాసాలు

ALL DISTRICTS RATIONALISATION AND PROMOTION LISTS

LESSON PLANS UPDATED FOR SEPTEMBER MONTH

Learn a Word a day September month words list

Flash...   LIC: వారి కోసం ఎల్‌ఐసీ కొత్త జీవిత బీమా పథకం... రూ.87 పెట్టుబడితో రూ.11 లక్షలు సొంతం..