Automatic Number Plates: ఫాస్టాగ్ ప్లేస్‌లో జీపీఎస్ నెంబర్ ప్లేట్.. ఇక టోల్ ప్లాజాల వద్ద ఆగే ప్రసక్తే లేదు..!

 Automatic Number Plates: ఫాస్టాగ్ ప్లేస్‌లో GPS  నెంబర్ ప్లేట్.. ఇక టోల్ ప్లాజాల వద్ద ఆగే ప్రసక్తే లేదు..!

Automatic Number Plates: టోల్‌ప్లాజాల దగ్గర రద్దీని మరింత తగ్గించాలనే లక్ష్యంతో కొత్త విధానం తీసుకురాబోతోంది కేంద్ర ప్రభుత్వం. ఫాస్టాగ్‌ స్థానంలో జీపీఎస్‌ సిస్టమ్‌ను అమలు చేయాలనే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. ఆటోమేటిక్‌ నంబర్‌ ప్లేట్‌ రికగ్నిషన్‌ వ్యవస్థను తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు చెప్పారు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ. దీని ద్వారా టోల్‌ప్లాజాల దగ్గర వాహన రద్దీని తగ్గించడంతో పాటు టోల్‌ వర్తించే హైవేలపై..ప్రయాణించిన దూరానికే టోల్‌ మొత్తాన్ని చెల్లించొచ్చని తెలిపారు. దీనివల్ల టోల్‌గేట్ల వద్ద వేచిచూసే అవసరం ఉండదని వెల్లడించారు.

2018 – 19లో టోల్‌ ప్లాజాల దగ్గర వాహనాల నిరీక్షణ సయమం సగటున 8 నిమిషాలుగా ఉండగా.. ఫాస్టాగ్‌లను ప్రవేశపెట్టాక..ఇది 47 సెకన్లకు తగ్గిందని గడ్కరీ చెప్పారు. నిరీక్షణ సమయం గణనీయంగా తగ్గినప్పటికీ జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇప్పటికీ నిర్దిష్ట సమయాల్లో రద్దీ ఎక్కువగా ఉంటోందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే కొత్తగా నిర్మించే జాతీయ రహదారుల పైనా, ప్రస్తుతం ఉన్న 4 పైగా లేన్ల హైవేలపైనా అధునాతన ట్రాఫిక్‌ నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. త్వరలో నంబర్‌ ప్లేట్‌ టెక్నాలజీని ప్రారంభించబోతున్నట్టు చెప్పారు. మరోవైపు ఇప్పటికే ప్రవేశపెట్టిన ఫాస్టాగ్‌లతో నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా టోల్‌ ఆదాయం..ఏడాదికి 15వేల కోట్లు పెరిగిందని వెల్లడించారు గడ్కరీ. ఇక రహదారిని ఉపయోగించినంత దూరానికే చెల్లించేలా కొత్తగా ప్రవేశపెట్టబోయే ఆటోమేటిక్‌ నంబర్‌ ప్లేట్‌ రీడర్‌ కెమెరాల టెక్నాలజీ ఉపయోగపడుతుందన్నారు.

Flash...   అమ్మఒడి పథకంపై పిల్‌ మూసివేత