మనం వాహనంలో ప్రయాణిస్తున్నప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్
సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో సాంకేతికత ఎంతగానో
అభివృద్ధి చెందింది, మనం ఒరిజినల్ డాక్యుమెంట్లను స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్
చేసి వాటిని ట్రాఫిక్ పోలీసులకు మరియు రవాణా శాఖ అధికారులకు
చూపించవచ్చు.
లైసెన్స్‌ను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే డిజిటల్ డ్రైవింగ్
లైసెన్స్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో చూద్దాం.
వివరాల్లోకి వెళితే.. వాహనదారులు
పరివాహన్ సేవా వెబ్‌సైట్,
డిజిలాకర్ వెబ్‌సైట్,
డిజిలాకర్ యాప్
ద్వారా కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
⧫ పరివాహన్ సేవా వెబ్‌సైట్‌లో డ్రైవింగ్ లైసెన్స్‌ని క్రింది విధంగా డౌన్‌లోడ్
చేసుకోండి:
⧫ పరివాహన్ సేవా వెబ్‌సైట్‌లో డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి పరివాహన్ సేవా
వెబ్‌సైట్‌ను తెరవండి.
⧫ హోమ్ పేజీలో ఆన్‌లైన్ సర్వీసెస్ కింద డ్రైవింగ్ లైసెన్స్ సంబంధిత సేవలపై క్లిక్
చేయండి.
⧫ రాష్ట్రం పేరును ఎంచుకోండి.
⧫ డ్రైవింగ్ లైసెన్స్ విభాగం నుండి ప్రింట్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని వివరాలను
నమోదు చేయండి.
⧫ PDF ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయండి అంతే.
డిజిలాకర్ యాప్‌లో డ్రైవింగ్ లైసెన్స్‌ని ఇలా డౌన్లోడ్ చేసుకోండి:
⧫ ముందుగా DigiLocker యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
⧫ తదుపరి వివరాలతో నమోదు చేసి లాగిన్ చేయండి.
⧫ పత్రాల విభాగంలో డ్రైవింగ్ లైసెన్స్‌ని ఎంచుకోండి.
⧫ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ హైవేస్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
⧫ శోధనలో డ్రైవింగ్ లైసెన్స్ నంబర్‌ను నమోదు చేయండి. అప్పుడు డౌన్లోడ్ చేసుకోండి.
డిజిలాకర్ వెబ్‌సైట్‌లో డ్రైవింగ్ లైసెన్స్‌ని ఇలా డౌన్లోడ్ చేసుకోండి:
⧫ డిజిలాకర్ వెబ్‌సైట్‌లో మీ ఖాతాతో లాగిన్ చేయండి.
⧫ ఎడమ వైపున ఉన్న శోధన పత్రాలపై క్లిక్ చేసి, డ్రైవింగ్ లైసెన్స్ ఎంపికను
ఎంచుకోండి.
⧫ రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖపై క్లిక్ చేయండి.
⧫ శోధనలో డ్రైవింగ్ లైసెన్స్ నంబర్‌ను నమోదు చేయండి. అప్పుడు డౌన్లోడ్ చేసుకోండి.