మార్చి 2022లో జరిగిన జాతీయ ఉపకార వేతన పరీక్ష (నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష) లో ఎంపిక అయిన విద్యార్థులు వెంటనే సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయంలో సంప్రదించి మెరిట్ కార్డులను తీసుకొని కార్డు వెనుక ముద్రించిన సూచనలు అనుసరిస్తూ 30-09-2022 లోపు తప్పకుండా నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ లో నమోదు చేసుకొనవలెను. తదుపరి సంబంధిత పాఠశాల నోడల్ ఆఫీసర్ లాగిన్ ద్వారా వెరిఫై చేయించుకొనవలెను. తదుపరి పోర్టల్ అప్లికేషన్ ప్రింట్ తో పాటు స్టడీ సర్టిఫికెట్, ఆదాయ ధృవీకరణ సర్టిఫికెట్, కుల ధృవీకరణ సర్టిఫికెట్, బ్యాంక్ పాసుబుక్ మొదటి పేజీ మొదలగునవి జతపరచి సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయంలో సమర్పించి జిల్లా నోడల్ | ఆఫీసర్ లాగిన్ ద్వారా తమ అప్లికేషన్ ను వెరిఫై చేయించుకొనవలెను.
పాఠశాల/కళాశాల నోడల్ ఆఫీసర్ లాగిన్ మరియు జిల్లా నోడల్ ఆఫీసర్ లాగిన్ ల ద్వారా వెరిఫై చేయబడిన అప్లికేషన్లకు మాత్రమే స్కాలర్షిప్ మంజూరు చేయబడుతుంది. లేని ఎడల స్కాలర్షిప్ మంజూరు కాబడదు. గత సంవత్సరాలలో ఈ పరీక్షలో ఎంపిక కాబడి ఈ సంవత్సరం 10,11,12 తరగతులు చదువుతూ అర్హత కలిగిన ప్రతి విద్యార్ధి కూడా ఈ సంవత్సరం రెన్యువల్ చేసుకుని పైన తెలిపిన విధంగా పాఠశాల/కళాశాల నోడల్ ఆఫీసర్ మరియు జిల్లా నోడల్ ఆఫీసర్ లాగిన్ ల ద్వారా తప్పనిసరిగా చెరిపై చేయించుకొనవలెను అని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శ్రీ డి. దేవానందరెడ్డి గారు తెలియజేశారు.