Redmi Phone Exploded: ఫోన్‌ను తల వద్ద పెట్టుకుని నిద్రపోతున్నారా..? చూడండి ఏం జరిగిందో ..

 Redmi Phone Exploded: ఫోన్‌ను తల వద్ద పెట్టుకుని నిద్రపోతున్నారా..? ఓ మహిళ కూడా అదే పని చేసింది.. ఆమెకు జరిగింది తెలిస్తే…

అభివృద్ది చెందుతున్న కాలంలో ప్రమాదాలు అడుగడుగునా పెరుగుతూనే ఉంటాయి. మనం రోజువారీ వాడే ఎలాక్ట్రానిక్ వస్తువులే ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. స్మార్ట్ ఫోన్ విస్తృతమైపోయిన ప్రస్తుత కాలంలో అందరి దగ్గరా తప్పనిసరిగా మొబైల్ ఉండటం పరిపాటి. అయితే ఒక మహిళ దగ్గరున్న మొబైల్ ఆమె ప్రాణాలను బలి తీసుకుంది. రాత్రి పూట ఆ మొబైల్‌ను పక్కన పెట్టుకుని నిద్రపోవడమే ఆమె చేసిన పొరపాటు అయింది.

ఢిల్లీకి చెందిన మంజీత్ అనే వ్యక్తి ట్విట్టర్ లో దిగ్బాంతి కలిగించే సంఘటనను షేర్ చేశాడు. మంజీత్ వాళ్ళ ఆంటీ నిద్రపోయేటప్పుడు సాధారణ అలవాటుగా మొబైల్ ను ప్రక్కనే పెట్టుకుని పడుకుంది. ఆమె నిద్రలో ఉండగా అది పేలిపోయింది. తలకు చాలా దగ్గర్లోనే మొబైల్ పేలడం వలన ఆమె తలకు తీవ్ర గాయాలు అయి అక్కడికక్కడే మరణించింది. అదే విషయాన్ని మంజీత్ ట్విట్టర్ లో పంచుకున్నారు. ఆ పేలిన మొబైల్ రెడ్ మి కంపెనీది కావడంతో రెడ్ మి ఇండియా వారిని ట్యాగ్ చేశాడు. 

దీంతో అతడి ట్వీట్‌కు రెడ్ మీ సంస్థ స్పందించింది. ‘భారతదేశంలో రెడ్ మి మొబైల్స్ వాడేవారి భద్రత మాకు చాలా ముఖ్యం. జరిగిన సంఘటన చాలా బాధకరం. బాదిత కుటుంబాన్ని కలసి వివరాలు కనుక్కుంటాం. ఆ కుటుంబానికి మద్దతుగా ఉంటాం..’ అని బదులిచ్చారు. కాగా, వారి స్పందనకు మంజీత్ మళ్ళీ రెస్పాండ్ అయ్యాడు. ‘మొబైల్స్ తయారీ సంస్థలు మొబైల్స్ విషయంలో ఉన్నత ప్రమాణాలు పాటించాలి. మొబైల్స్ మార్కెట్ లోకి విడుదల చేసేటపుడు క్షుణ్ణంగా అన్ని విషయాలు గమనించుకున్న తరువాతనే విడుదల చేస్తే ప్రజలకు రక్షణ ఉంటుంది. అలాగే ప్రభుత్వం మొబైల్ తయారీ సంస్థల విషయంలో చాలా కఠిన నిబంధనలు విధించాలి’ అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 

Flash...   Deputations to IASEs/ CTEs/ GCPE /DIETs Certain Instructions

ఇదిలా ఉండగా.. బాధిత కుటుంబానికి మీరు ఇచ్చిన మాట ఏమయ్యిందంటూ మీడియా నేరుగా రెడ్ మి సంస్థను ఆరా తీసింది. ‘మొబైల్ ఎందుకు పేలింది అనే కారణం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం, వివరాలు తెలిసిన తరువాత మేము ఏం చేస్తామన్నది వెల్లడిస్తాం..’ అని రెడ్ మి సంస్థ చెప్పడం గమనార్హం