SBI Offers: ఎస్‌బీఐ కస్టమర్లకు భారీ తగ్గింపు.. ఏకంగా 8 ఆఫర్లు!

 SBI Offers: ఎస్‌బీఐ కస్టమర్లకు భారీ తగ్గింపు.. ఏకంగా 8 ఆఫర్లు!


Super Saving Days | దేశంలోనే అతిపెద్ద బ్యాంక్‌గా కొనసాగుతూ వస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అదిరిపోయే ఆఫర్లతో కస్టమర్ల ముందుకు వచ్చింది. ఎస్‌బీఐ యోనో (YONO) సూపర్ సేవింగ్ డేస్ పేరుతో పలు రకాల డిస్కౌంట్ ఆఫర్లను అందుబాటులో ఉంచింది. పలు ట్రాన్సాక్షన్లపై భారీ తగ్గింపు అందిస్తోంది. ఏ ఏ వాటిపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

SBI Super Saving Days లో భాగంగా YONO బుకింగ్స్‌పై ఏకంగా 50 శాతం వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. పని మీద వేరే ఊళ్లకు వెళ్లి అక్కడే ఉండాల్సి వస్తే.. అలాంటి వారికి ఈ ఆఫర్ వల్ల బెనిఫిట్ పొందొచ్చు. ఓయో బుక్ చేసుకొని అధిక తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. దీనికి యోనో కోడ్ వాడాల్సి ఉంటుంది

అలాగే ITC స్టోర్‌పై తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంచింది ఎస్‌బీఐ. ఫ్లాట్ 20 శాతం తగ్గింపు అందిస్తోంది. అయితే ఇక్కడ ట్రాన్సాక్షన్ లిమిట్ ఉంది. అంటే రూ. 799 లేదా ఆపైన విలువ కలిగిన ఆర్డర్లకు మాత్రమే డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుంది. దీనికి యోనో20922 కోడ్ ఉపయోగించాల్సి ఉంది.

READ: 

సులభంగానే రూ.14 లక్షల రుణం.. అర్హతలు ఇవే!

PPF కేవలం 1% వడ్డీకి రుణం ఇస్తుంది! ఇదీ ప్రక్రియ!!

అద్భుత పథకం.. రూ. 10,000 పెట్టుబడి మరియు రూ. 16 లక్షల ఆదాయం..!

మేక్ మై ట్రిప్ ద్వారా భారీ తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఏకంగా రూ. 5 వేల వరకు తగ్గింపు పొందొచ్చు. హోటల్ బుకింగ్స్‌కు మాత్రమే ఇది వర్తిస్తుంది. అయితే కస్టమర్లు ఈ తగ్గింపు పొందాలని భావిస్తే.. కచ్చితంగా ఎస్‌బీఐఎంఎంటీ అనే కోడ్ ఉపయోగించాల్సి ఉంటుందని గుర్తు పెట్టుకోవాలి.

అలాగే ప్రముఖ ఈకామర్స్ సంస్థల్లో ఒకటైన టాటా క్లిక్‌లో కూడా ఆఫర్లు లభిస్తున్నాయి. 10 శాతం తక్షణ డిస్కౌంట్ ఉంది. గరిష్టంగా రూ. 500 వరకు తగ్గింపు పొందొచ్చు. అలాగే ఈ ఆఫర్ పొందాలంటే కనీస ట్రాన్సాక్షన్ విలువ రూ. 1000గా ఉంది. ఇంకా యోనోసేవర్‌సెప్ అనే కోడ్ ఉపయోగించాలి.

Flash...   Child info new student enroll process

SBI కస్టమర్లకు మరో ఆఫర్ కూడా ఉంది. జీవైఎఫ్‌టీఆర్‌లో భారీ తగ్గింపు లభిస్తోంది. 71 శాతం వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఇన్‌స్టంట్ వోచర్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. దీనికి ఎలాంటి కోడ్ అవసరం లేదని ఎస్‌బీఐ తెలియజేస్తోంది.

SBI YONO యూజర్లకు క్లియర్‌ట్రిప్‌లో కూడా ఆఫర్లు లభిస్తున్నాయి. విమాన ప్రయాణం చేయాలని భావించే వారికి మంచి ఆఫర్ ఒకటి ఉంది. ఫ్లాట్ 15 శాతం తగ్గింపు లేదా గరిష్టంగా రూ. 2 వేల వరకు తగ్గింపు పొందొచ్చు. దీని కోసం సీటీఎస్‌బీఐ అనే కోడ్ ఉపయోగించాల్సి ఉంటుంది.

అలాగే SBI మరో ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. హోటల్ బుకింగ్స్‌పై కూడా క్లియర్‌ట్రిప్ ద్వారా తగ్గింపు లభిస్తోంది. ఫ్లాట్ 20 శాతం లేదా గరిష్టంగా రూ. 2 వేల వరకు డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ పొందాలన్నా కూడా సీటీఎస్‌బీఐ అనే కోడ్ వాడాల్సి ఉంటుంది

కాగా SBI కస్టమర్లు YONO యాప్ ద్వారా ఈ ఆఫర్లు పొందగలరు. దీని కోసం ఎస్‌బీఐ యోనో యాప్‌లోకి లాగిన్ అవ్వాలి. యోనో యాప్ లేకపోతే గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. తర్వాత రిజిస్టర్ చేసుకోవాలి. అటుపైన లాగిన్ అవ్వాలి.