ఒక HM , ఇద్దరు ఉపాధ్యాయులు సస్పెన్షన్: కలెక్టర్ ఆదేశాలు

గుంటూరు విద్య, న్యూస్టుడే: పేద కుటుంబాల్లో పిల్లలను విద్యావంతులు చేయాలనే క్రమం లో ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మఒడి పథకం పక్కదారి పడుతోంది. కొందరు పథకంలో లొసు గులు, సాంకేతిక లోపాలు ఆసరా చేసు కుని ఈ పథకం నుంచి వచ్చే డబ్బును పక్కదారి పట్టిస్తూ ఏకంగా రూ.5.25 లక్షలు కాజే శారు. పల్నాడు జిల్లా నరసరావుపేట రూరల్ మండలం ములకలూరు గ్రామంలో తల్లిదండ్రులుగా నమోదైన వారి బ్యాంకు ఖాతాలకు ఆ సొమ్ము పడే టట్లు చేశారు. ఈవిషయమై ఆ జిల్లా కలెక్టర్ శివశం కర్ విచారణకు ఆదేశించగా నిజాలు వెలుగులోకి వచ్చాయి. గుంటూరు నగరంలో పలు పాఠశాలల్లో విద్యార్థులుగా నమోదై డ్రాపౌట్ అయిన వారి వివరాలు చైల్డ్ ఇన్ఫోలో అలాగే ఉండటంతో ఆ విద్యార్థుల తల్లి దండ్రులుగా, గార్డియన్లుగా కొందరు మహిళలకు చెందిన బ్యాంకు ఖాతాలతో ఈ దందా చేశారు.

పల్నాడు జిల్లా కలెక్టర్ సూచనలో గుంటూరు జిల్లాకలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు డీఈవో శైలజ చర్యలు చేపట్టారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం కరీము న్నీసా, రామనామక్షేత్రం గణేష్ ఎయి డెడ్ ప్రాథమిక పాఠశాల ఎస్జీటీ కె. సర ళాదేవి, నల్లచెరువులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఎయిడెడ్ ప్రాథమిక స్కూల్ ఎస్జీటీ సయ్యద్ జాకీర్ హుస్సేన్లను సస్పెండ్ చేశారు. నల్ల చెరువులోని రాజస్థానీ స్కూల్, నగరంలో నిర్వహి స్తున్న మదర్సాకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

విచారిస్తే మరిన్ని వెలుగులోకి వచ్చే అవకాశం.. చైల్డ్ ఇన్ఫోలో విద్యార్థుల వివరాలు అప్డేట్ చేయ డంలో నిర్లక్ష్యంతోపాటు ఎంఈవోలు, హెచ్ఎంల పర్య వేక్షణ లోపంతో అక్రమాలు జరుగుతున్నట్లు తెలు స్తోంది. రెండు సంవత్సరాల పథకం లబ్ది పొందిన వారి ఖాతాలో ఈ ఏడాది డబ్బు పడలేదు. పాఠశాలలు, తర గతుల వారీగా విచారణ చేయిస్తే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Flash...   LPG GAS సిలెండర్ వాడే వారికి అలర్ట్..!