PM SRI SCHOOLS : పీఎం శ్రీ’ పాఠశాలలు..మండలానికి రెండు

♦️పీఎం శ్రీ’ పాఠశాలలు..మండలానికి రెండు

♦️ఎన్ఈపీ-2020 లక్ష్యాలకు అనువుగా తీర్చిదిద్దనున్న కేంద్రం

 ♦️సకల సౌకర్యాలతో దేశవ్యాప్తంగా14,500 బడులు

 నూతన జాతీయ విద్యా విధానం -2020 లక్ష్యా లకు అనుగుణంగా దేశవ్యాప్తంగా 14,500 పాఠశాలలను సకల సౌకర్యా లతో తీర్చిదిద్దాలని నిర్ణయించిన కేంద్రం మండలానికి రెండు పాఠశాల లను ఎంపిక చేయనుంది. ఇప్పటికే ఉన్న ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసి పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తారు. అందుకు ఒక్కో బడికి రూ. కోటిన్నర నుంచి రూ.2 కోట్లు వెచ్చిస్తారు. పథకం, విధి విధానాలను వివరించేందుకు అన్ని రాష్ట్రాల విద్యాశాఖ అధికారులతో కేంద్ర అధికారులు శుక్రవారం ఢిల్లీలో సమావేశం నిర్వహించారు. ఏటా కొన్ని చొప్పున ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభమై 2026-27 నాటికి దేశవ్యాప్తంగా 14,500 పాఠశాలలను అభివృద్ధి చేస్తారు. అందుకు రూ.27,360 కోట్లు వ్యయం చేయాలని కేంద్రం నిర్ణయించగా అందులో కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు 60:40 శాతం వాటాలు భరిస్తాయి. ఈ పథకం వల్ల 18 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని అంచనా వేశారు. ఒక్కో పాఠశాలలో సగటున 125 మంది విద్యార్థులు ఉంటారు..

♦️ఏమిటీ పీఎం శ్రీ ?

నూతన జాతీయ విద్యా విధానం -2020లో పలు లక్ష్యాలను కేంద్రం నిర్దే శించింది. తరగతికి తగిన విద్యాసామర్ధ్యాలు ఉండాలని, ఒత్తిడి లేని విద్య అందించాలని, విద్యేతర కార్యక్రమాలకూ పెద్దపీట వేయాలని, గ్రంథాలయం, కంప్యూటర్ ల్యాబ్, క్రీడా మైదానం వంటి సౌకర్యాలతోపాటు పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులు ఉండాలని, విద్యార్థులను అన్ని విధాలా తీర్చిదిద్దాలన్నది లక్ష్యం. దాన్ని చేరుకునేందుకు అనువుగా పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా(పీఎం శ్రీ) పేరిట గత నెలలో కొత్త పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

♦️ఎంపిక ఎలా… ఎన్ని వస్తాయి?

ఛాలెంజ్ విధానంలో మండలానికి గరిష్ఠంగా రెండు పాఠశాలలను ఎంపిక చేస్తారు. అందులో ఒకటి ప్రాథమిక, మరొకటి ఉన్నత పాఠశాలలు ఉంటాయి. ప్రాథమికంగా ఎంపికైన పాఠశాలల జాబితాను యూడైస్ ఆధా రంగా కేంద్ర రాష్ట్రానికి పంపిస్తుంది. ఇందుకోసం ప్రధానోపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలి. వాటిని జిల్లా, రాష్ట్ర, కేంద్ర స్థాయులలో పరిశీలించి తుది ఎంపిక చేస్తారు. అంటే ఎక్కువ మంది విద్యార్థులున్న, ఎక్కువ విస్తీర్ణం, ఉత్తమ విధానాలు అవలంబించే, వినూత్నంగా బోధన చేసే పాఠశాలలు ఎంపికయ్యే అవకాశం ఉంది.

Flash...   World’s Most Vaccinated Nation Is Spooked by Covid Spike