SBI కస్టమర్లకు దీపావళి కానుక.. నేటి నుంచి..

 SBI కస్టమర్లకు దీపావళి కానుక.. నేటి నుంచి..


SBI: దేశంలోనే అతిపెద్ద బ్యాంక్‌గా కొనసాగుతున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తాజాగా తన ఖాతాదారులకు Good News అందించింది. కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (ఎఫ్‌డీ) వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇది చాలా మందికి ఉపశమనం కలిగిస్తుంది.

SBI ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 20 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. రూ. 2 కోట్ల లోపు డిపాజిట్లపై ఈ పెంపు వర్తిస్తుంది. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, వడ్డీ రేట్ల పెంపు నిర్ణయం అక్టోబర్ 15 నుండి అమలులోకి వస్తుంది.

Read: ఒక HM , ఇద్దరు ఉపాధ్యాయులు సస్పెన్షన్:  కారణం ఇదే…

స్టేట్ బ్యాంక్ రెండు నెలల తర్వాత రిటైల్ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. వడ్డీ రేట్ల పెంపుదల 10 బేసిస్ పాయింట్ల నుంచి 20 బేసిస్ పాయింట్ల వరకు ఉంది. ఏ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎంత వడ్డీ రేటు పెరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

7 రోజుల నుంచి 45 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 2.9 శాతం నుంచి 3 శాతానికి ఎస్‌బీఐ పెంచింది. అలాగే, 46 రోజుల నుంచి 179 రోజుల ఎఫ్‌డిలపై వడ్డీ రేటు 4 శాతానికి చేరుకుంది. ఇప్పటివరకు ఈ పదవీకాలంలో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 3.9 శాతంగా ఉంది.

అలాగే 180 రోజుల నుంచి 210 రోజుల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 4.55 శాతం నుంచి 4.65 శాతానికి పెరిగింది. అయితే 211 రోజుల నుంచి ఏడాది వరకు ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 4.6 శాతం నుంచి 4.7 శాతానికి పెరిగింది. ఇప్పుడు ఏడాది నుంచి రెండేళ్ల కాలపరిమితి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 5.6 శాతం. ఇప్పటి వరకు ఈ పద్దుపై వడ్డీ రేటు 5.45 శాతంగా ఉంది.

Read: ఉపాధ్యాయుల ప్యానెల్ నెంబర్ లు కొరకు ఈ  లింక్ చుడండి

Flash...   Indian Coastal Cities: ఈ నగరాలు మరికొన్నేళ్లలో మునిగిపోతాయట!

రెండు నుంచి మూడేళ్ల కాలపరిమితి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 5.5 శాతం నుంచి 5.65 శాతానికి పెరిగింది. మూడు నుంచి ఐదేళ్ల కాలపరిమితి కలిగిన ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 5.6 శాతం నుంచి 5.8 శాతానికి పెరిగింది. అంటే ఇక్కడ వడ్డీ రేటు 20 బేసిస్ పాయింట్లు పెరిగింది.

ఐదేళ్ల నుంచి పదేళ్ల వ్యవధిలో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 5.85 శాతానికి చేరుకుంది. ఇప్పటివరకు ఈ వడ్డీ రేటు 5.65 శాతంగా ఉంది. ఇంతకుముందు కంటే ఇప్పుడు బ్యాంకులో డబ్బు ఉంచితే అధిక రాబడులు వస్తాయని చెప్పవచ్చు.

అంతే కాకుండా సీనియర్ సిటిజన్లకు కూడా బ్యాంకు తీపి కబురు అందించింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచారు. వడ్డీ రేటు 20 బేసిస్ పాయింట్లు పెరిగింది. వీటికి 3.5 శాతం నుంచి 6.65 శాతం వడ్డీ లభిస్తుంది. కొత్త ఎఫ్‌డిలు లేదా పాత ఎఫ్‌డిలను పునరుద్ధరించే వారికి మాత్రమే కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయని గమనించాలి.

Also Read: 

 1.సంవత్సరానికి కేవలం రూ.20.. మీ జీవితానికి గొప్ప భద్రత.. 

  2.SBI  కస్టమర్లకు భారీ తగ్గింపు.. ఏకంగా 8 ఆఫర్లు!

 3.SBI కొత్త సదుపాయం.. ఇంట్లోనే ఉండి రూ.35 లక్షల ప్రయోజనం