GO MS 180 DELEGATION POWERS OF DEO, DYEO, MEO, HM

  వివిధ రకాల సెలవులు,జీతాలు, ఇంక్రిమెంట్లు, పే ఫిక్సేషన్లు  మంజూరు తదితర అధికారాలు క్లుప్తంగా GO 180 ముఖ్యాంశాలు  తెలుగులో

GO MS 180 Dt:18.11.2022

1. ఇప్పటి వరకు అమలులో ఉన్న సెలవు మంజూరు అధికారాల జీవో 40, జీవో 70, జీవో 84  స్థానంలో ఈ జీవో 180 విడుదల

2. ఈ జీవో అన్ని గవర్నమెంట్, జిల్లా పరిషత్, మండల పరిషత్, “మున్సిపల్” మ్యానేజ్మెంట్ స్కూల్స్ మరియు టీచర్స్ కు (Govt., ZPP/MPP & Municipal)  వర్తింపు 

3. మిగతా మ్యానేజ్మెంట్ ప్రధానోపాధ్యాయులతో సమానంగా “మున్సిపల్ ప్రధానోపాధ్యాయులకు” కూడా  డ్రాయింగ్ పవర్స్ 

 1 నుండి 8 తరగతులు ఉన్న ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్, ప్రీ హై స్కూల్ (Primary, UP ) ప్రధానోపాధ్యాయులు, ఆ స్కూల్స్ లో టీచర్ లకు సి ఎల్స్, స్పెషల్ సి ఎల్స్, మంజూరు అధికారం కలిగి ఉంటారు 

హై స్కూల్ మరియు హై స్కూల్ ప్లస్  ప్రధానోపాధ్యాయులు (Govt., ZPP/MPP & Municipal) తమ టీచర్స్ కు  CLs, Special Cls, 

 అలాగే  ELs, Half Pay Leaves, EOL, Commuted Leaves నాలుగు (4) నెలల వరకు, 6 నెలల  మాటర్నిటీ లీవ్ మంజూరు చేయవచ్చు 

 ఇంక్రిమెంట్స్, పే ఫిక్సేషన్ లు, ఏ ఏ ఎస్, ఎల్ టి సి, పి ఎఫ్ పార్ట్ ఫైనల్, లోన్, APGLI, GIS ఫార్వార్డ్ చేయడం, పెన్షన్ ప్రపోజల్స్ పంపడం, మెడికల్ రీయంబర్స్మెంట్ ప్రపోజల్స్  డ్రాయింగ్ వంటి అధికారాలు కలిగి ఉంటారు 

    మండల విద్యా శాఖా అధికారులు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్: MEO/DI

  ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్, ప్రీ హై స్కూల్ (Primary, UP -Govt., ZPP/MPP & Municipal) హెడ్ మాస్టర్స్ యొక్క CLs, Spl CLs మంజూరు అధికారం 

  తమ మండలంలోని ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్, ప్రీ హై స్కూల్ లో ఉపాధ్యాయుల అందరి ELs, Half Pay Leaves, EOL, Commuted Leaves తదితర  ఇతర సెలవులు నాలుగు (4) నెలల వరకు, 6 నెలల  మాటర్నిటీ లీవ్ మంజూరు అధికారం 

Flash...   NTA Exam Calendar 2024 : విద్యార్థులకు అలర్ట్‌.. JEE, NEET UG, NEET PG, CUET UG PG, UGC NET పరీక్ష తేదీలు వచ్చేశాయ్‌

 ఇంక్రిమెంట్స్, పే ఫిక్సేషన్ లు, ఏ ఏ ఎస్, ఎల్ టి సి, పి ఎఫ్ పార్ట్ ఫైనల్, లోన్, APGLI, GIS ఫార్వార్డ్ చేయడం, పెన్షన్ ప్రపోజల్స్ పంపడం, మెడికల్ రీయంబర్స్మెంట్ ప్రపోజల్స్  డ్రాయింగ్ వంటి అధికారాలు కలిగి ఉంటారు 

 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ DYEO

 హై స్కూల్ మరియు హై స్కూల్ ప్లస్ లో ప్రధానోపాధ్యాయుల (Govt., ZPP/MPP & Municipal) CLs, Spl CLs మంజూరు అధికారం 

  తమ పరిధిలోని  అన్ని ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్, ప్రీ హై స్కూల్  హై స్కూల్ మరియు హై స్కూల్ ప్లస్ లో అందరు ఉపాధ్యాయుల,  ప్రధానోపాధ్యాయుల (Govt., ZPP/MPP & Municipal) ELs, Half Pay Leaves, EOL, Commuted Leaves నాలుగు 4 నెలల పై బడి 6 నెలల వరకు మంజూరు చేయవచ్చు 

  హై స్కూల్ మరియు హై స్కూల్ ప్లస్ లో ప్రధానోపాధ్యాయుల ఇంక్రిమెంట్స్, పే ఫిక్సేషన్ లు, ఏ ఏ ఎస్, ఎల్ టి సి, పి ఎఫ్ పార్ట్ ఫైనల్, లోన్, APGLI, GIS ఫార్వార్డ్ చేయడం, పెన్షన్ ప్రపోజల్స్ పంపడం, మెడికల్ రీయంబర్స్మెంట్ ప్రపోజల్స్  డ్రాయింగ్ వంటి అధికారాలు కలిగి ఉంటారు 

  డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్: DEO

 తమ పరిధిలో ని  డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ / అసిస్టెంట్ డైరెక్టర్,/ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ / మండల విద్యా శాఖా అధికారులు CLs, Spl CLs మంజూరు అధికారం 

 తమ పరిధిలోని  అన్ని ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్, ప్రీ హై స్కూల్  హై స్కూల్ మరియు హై స్కూల్ ప్లస్ లో అందరు ఉపాధ్యాయుల,  ప్రధానోపాధ్యాయుల, (Govt., ZPP/MPP & Municipal) ELs, Half Pay Leaves, EOL, Commuted Leaves 6 నెలల పై బడి 1 సంవత్సరం  వరకు మంజూరు చేయవచ్చు 

  డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ / అసిస్టెంట్ డైరెక్టర్,/ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ / మండల విద్యా శాఖా అధికారుల ఇంక్రిమెంట్స్, పే ఫిక్సేషన్ లు, ఏ ఏ ఎస్, ఎల్ టి సి, పి ఎఫ్ పార్ట్ ఫైనల్, లోన్, APGLI, GIS ఫార్వార్డ్ చేయడం, పెన్షన్ ప్రపోజల్స్ పంపడం, మెడికల్ రీయంబర్స్మెంట్ ప్రపోజల్స్  డ్రాయింగ్ వంటి అధికారాలు కలిగి ఉంటారు.

Flash...   Vivo X Series: స్టన్నింగ్‌ ఫీచర్స్‌తో Vivo సరికొత్త స్మార్ట్‌ఫోన్‌.. ధర ఎంతంటే..

GO MS 180 COMPLETE EXTRACT DOWNLOAD