ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు….!

 ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు….!

సీఎంఓ లో బదిలీల ఫైల్.. అక్రమ బదిలీలు నిలిపివేయాలి … 

ప్రజాశక్తి – కర్నూలు:  కలెక్టరేట్ ఎన్నో రోజుల నుండి ఉపాధ్యాయులు మహిళల కోసం ఎదురుచూస్తున్నారు. బదిలీల షెడ్యూలు విడుదల అవుతుందనుకుంటే అంతలోపే ఆక్రమ బదిలీలకు తెర లేపారు. ఎమ్మెల్యేలు మంత్రులు ఇచ్చిన సిఫార్సుల మేరకు ఉపాధ్యాయుల బదిలీలను చేపట్టేందుకు త్వరలో ఇతరులు రాసినట్లు తెలిసింది. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలను వెంటనే చేపట్టాలని గత కొన్ని నెలలుగా ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఉపాధ్యాయుల బదిలీలపై ఆ సంఘాల నేతలతో సమావేశం నిర్వహించి సలహాలు సూచనలు తీసుకున్నారు. ఒకవైపు ఈ వ్యవహారం జరుగుతుంటే మరోవైపున అక్రమంగా ఉపాధ్యాయుల బదిలీలను చేపట్టేందుకు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఆమోదముద్ర పడగానే సంబంధిత విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. 

కర్నూలు జిల్లాలో దాదాపుగా 20 మంది పైగా ఉపాధ్యాయులు బదిలీల కోసం ఎమ్మెల్యేలు మంత్రుల నుండి సిఫార్సు లేఖలను ప్రభుత్వానికి పంపారు. ఈ బదిలీలను చేపట్టేందుకు ఒక్కో ఉపాధ్యాయుడి నుండి ఎమ్మెల్యేలు రూ.3 నుండి రూ.5 లక్షల వరకు కూడా వసూలు చేసినట్లు సమాచారం. సదరు ఉపాధ్యాయులకు కోరుకున్న స్థానాలకు బదిలీ చేసేందుకు సిఫార్సు లేఖలను ప్రభుత్వానికి ముడుపులు తీసుకొని పంపారు. ఈ బదిలీలను చేపట్టేందుకు గతంలో ప్రభుత్వం సిద్ధమవుగా వెంటనే మీడియాలో రావడంతో తాత్కాలికంగా నిలిపివేశారు. మళ్లీ ఇప్పుడు ప్రజా ప్రతినిధులు ఇచ్చిన సిఫార్సు లేఖల ప్రకారం బదిలీలను నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. 

ఈ బదిలీల ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం ఉపాధ్యాయుల బదిలీల షెడ్యూలును విడుదల చేసేందుకు విద్యాశాఖ అధికారులు సిద్ధమయ్యారు. కౌన్సిలింగ్ ఆధారంగా బదిలీలను జరపకుండా అక్రమంగా సిఫార్సు లేఖలు పొందిన వారికి చేపట్టడం పట్ల ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. అక్రమ బదిలీలను నిలిపివేసి కౌన్సిలింగ్ ఆధారంగా బదిలీలు చేపట్టినందుకు షెడ్యూల్ విడుదల చేయాలని కోరుతున్నాయి. బదిలీలను గతంలో బ్యాన్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

Flash...   Know your Salary Details with your CFMS id

BAN, కౌన్సిలింగ్ నిబంధనలను గాలికి వదిలేసి కాసులకు కక్కుర్తిపడి బదిలీలు చేస్తున్నారు. వీటికి ఏదో ఒకచోట పుల్స్టాఫ్ పెట్టవలసి ఉంది 

బదిలీల షెడ్యూల్ విడుదల చేయాలి

– కె. సురేష్ కుమార్, యుటిఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షులు

ఉపాధ్యాయుల బదిలీల షెడ్యూల్ వెంటనే విడుదల చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ప్రతినిధులు ఇచ్చిన సిఫార్సు లేఖల ప్రకారం బదిలీలు నిర్వహించేందుకు సన్నద్ధం కావడం దుర్మార్గం. అలాంటి అక్రమ బదిలీలను వెంటనే నిలిపివేసి కౌన్సిలింగ్ ఆధారంగా బదిలీలను చేపట్టాలి.