Cyclone Mandaus : దూసుకు వస్తున్న తుఫాన్ . AP కి హెచ్చరిక

బంగాళాఖాతంలో ఏర్పడిన మాండౌస్ తుపాను.. ఇవాళ ఉదయం తీవ్ర వాయుగుండంగా మారి తీరం వైపు దూసుకుపోతోంది. ఈ తుపాను కారణంగా తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులోని 13 జిల్లాలకు భారత వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ ప్రకటించింది. పుదుచ్చేరి ప్రభుత్వం రెండు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది.

ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా కొనసాగుతున్న మాండౌస్… తీరం వైపు దూసుకుపోతోంది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి వాయువ్య బంగాళాఖాతం వైపు కదులుతున్న మాండస్ తుఫాను… ఈ రాత్రికి పుదుచ్చేరి-శ్రీహరికోట మధ్య మహాబలిపురం వద్ద తీరం దాటే అవకాశం ఉంది ….IMD తెలిపింది. మండూస్ గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ముందుకు సాగుతోంది. మాండౌస్ ప్రాంతంలో భారీ వర్షాలు, బలమైన గాలులు వీస్తాయని IMD హెచ్చరికతో తమిళనాడులోని 13 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున తమిళనాడు ఉత్తర కోస్తాలోని చెంగల్పట్టు, విల్లుపురం, కాంచీపురం జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. తుపాను కరెంటు కోతలు వస్తాయని… వరదలు వస్తాయని… ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని… అత్యవసరమైతేనే బయటకు రావాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

KNOW LIVE LOCATION OF CYCLONE


CLICK HERE TO KNWO LIVE CYCLONE MOMENT

Flash...   ఇక నుంచి విద్యుత్తు కూడా ప్రీ పెయిడ్ .. అన్ని విద్యుత్ మీటర్లు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లతో భర్తీ చేయబడతాయి...