AP NEWS: రిటైర్మెంట్ వయసు @ 63 కొత్త ప్రతిపాదనలు ..రాష్ట్ర సర్కారు కసరత్తు

 ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు మరోమారు పెరగనుందా? విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ ప్రశ్నకు సమాధానం అవుననే! ప్రస్తుతమున్న 62 సంవత్సరాల ఉద్యోగవిరమణ వయసును 63 సంవత్సరాలకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు విస్తృతస్థాయిలో కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. అయితే, తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని, న్యాయపరమైన అంశాలతో పాటు, ఇతర విషయాలను పరిగణలోకి తీసుకుని పరిశీలి స్తున్నామని ఉన్నతస్థాయి అధికారి ఒకరు చెప్పారు. ‘అన్ని విషయాలను లోతుగా పరిశీలించిన తరువాతే తుది నిర్ణయం ఉంటుంది. అని ఆయన అన్నారు.

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత 2014 జూన్లో ఉద్యోగ విరమణ వయసును 58 నుంచి 60 ఏళ్లకు పెంచుతూ నిర్ణయించగా, జగన్మోహన్రెడ్డి సర్కారు 62 ఏళ్లకు పెంచింది. తాజాగా మరో ఏడాది పెంచాలన్న ఆలోచన వెనుక ఆర్థికాంశాలే కీలకమని భావిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల విరమణ అనంతరం ఉద్యోగులకు కల్పించాల్సిన ప్రయోజనాలు మరో ఏడాది వరకు వాయిదా వేయవచ్చని, దీనివల్ల కొంత మేర ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని అంటున్నారు. అదే సమయంలో నిరుద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత కూడా వచ్చే అవకాశం ఆ దిశలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా అన్నది . చర్చనీయాంశంగా మారింది.


Flash...   Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్‌లో బెస్ట్ ఇదే.. ఏడాదిలో 20శాతం వరకూ రాబడి