SBI Offers: SBI రూ.40,000 డిస్కౌంట్ ఆఫర్.. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు వాడే వారికి బ్యాంక్ శుభవార్త!

 SBI OFFERS: SBI రూ.40,000 తగ్గింపు ఆఫర్.. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ వాడే వారికి శుభవార్త!


SBI News: మీరు SBI కస్టమర్లా? అయితే శుభవార్త. మీ కోసం భారీ తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంది. కలిపి రూ. 40 వేల వరకు తగ్గింపు పొందవచ్చు.

SBI YONO: మీకు దేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో ఖాతా ఉందా? మీరు బ్యాంక్ డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. మీ కోసం భారీ తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంది

బ్యాంకు తన ఖాతాదారులకు ఏకమొత్తంగా రూ. 40 వేల వరకు తగ్గింపు ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్రయోజనం SBI డెబిట్ కార్డ్ మరియు క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ ఆఫర్‌ను ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.

SBI ట్రావెల్ పోర్టల్ మై ట్రిప్‌తో భాగస్వామ్యం కలిగి ఉంది. ఇందులో భాగంగా హాలిడే ప్యాకేజీలపై సూపర్ ఆఫర్ అందుబాటులోకి తెచ్చింది. SBI ఖాతాదారులు రూ. 40,000 తగ్గింపు పొందవచ్చు.

SBI యోనో ద్వారా మై ట్రిప్‌లో హాలిడే ప్యాకేజీని బుక్ చేసుకుంటే, SBI కస్టమర్‌లు ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు. SBI డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపు చేయవచ్చు. ఇలా చేసిన వారికి భారీ రాయితీ లభిస్తుంది.

కానీ హాలిడే ప్యాకేజీని బుక్ చేసుకునే సమయంలో SBIMMT కూపన్ కోడ్ తప్పనిసరిగా ఉపయోగించాలి. అప్పుడే డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ పరిమిత కాలానికి మాత్రమే చెల్లుబాటు అవుతుందని గుర్తుంచుకోండి.

అలా కాకుండా మీరు ఇప్పటికే SBI Yono యాప్ వాడుతున్నట్లయితే.. ఈ ఆఫర్ ను సులభంగా పొందవచ్చు. మీరు SBI Yono యాప్‌ని ఉపయోగించకుంటే, మీరు Google Play Store నుండి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అప్పుడు మీరు నమోదు చేసుకోవాలి. దీనికి మీ నెట్ బ్యాంకింగ్ వివరాలు అవసరం. అలాగే మీరు బ్యాంక్ ఖాతాతో మొబైల్ నంబర్‌ను లింక్ చేసి ఉండాలి. అప్పుడే యోనో యాప్ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.

Flash...   Primary Schools co located with High Schools

మరోవైపు, గృహ రుణాలు తీసుకునే వారికి కూడా SBI ఆఫర్లను అందిస్తోంది. ఈ ఆఫర్ ఈ నెలాఖరు వరకు వర్తిస్తుంది. ఇందులో భాగంగా ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు, వడ్డీ రేటు రాయితీ వంటి ప్రయోజనాలను పొందవచ్చు. సొంత ఇంటి కలను సాకారం చేసుకోవాలనుకునే వారికి ఇదో చక్కటి ఛాన్స్ అని చెప్పొచ్చు.

DONWLOAD SBI YONO

SBI OFFICIAL WEBSITE