wake up late?: ఆలస్యంగా నిద్రలేవడం ఎంత ప్రమాదమంటే..?

wake up late?: ఆలస్యంగా నిద్రలేవడం ఎంత ప్రమాదమంటే..?


ఆలస్యంగా నిద్రలేవడం వల్ల అనారోగ్యాల బారిన పడే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆలస్యంగా నిద్రలేవడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం 40 శాతం ఎక్కువగా ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే స్థూలకాయం, షుగర్, కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివర్ వంటి మెటబాలిక్ డిజార్డర్స్ మరియు సరైన జీవనశైలి కారణంగా హార్మోన్ల అసమతుల్యత ఎక్కువగా ప్రభావితం అవుతాయి. సమస్యల కారణంగా ప్రజలు తొందరగా మరణిస్తున్నారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఆలస్యంగా నిద్రలేవడం వల్ల మానసిక సమస్యలు వచ్చే అవకాశం 30 శాతం ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆలస్యంగా నిద్రలేవడం వల్ల ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్, చిరాకు, కోపం వంటి అనేక రకాల మానసిక సమస్యలు వస్తాయని వారు చెబుతున్నారు.

అలాగే ఆలస్యంగా నిద్రలేవడం వల్ల శరీరంలోని బయోలాజికల్ క్లాక్ దెబ్బతింటుందని, హార్మోన్ల అసమతుల్యత, థైరాయిడ్ వంటి భయంకరమైన సమస్యలతో పాటు శరీరంలో జీవక్రియలను నియంత్రించే హార్మోన్ల పనితీరు కూడా దెబ్బతింటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే ఆలస్యంగా నిద్రలేవడం వల్ల మెదడులోని కణాలు తగ్గిపోయి మతిమరుపు, అల్జీమర్స్ వంటి సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆలస్యంగా నిద్రలేచే అలవాటును వీలైనంత త్వరగా వదిలించుకోవాలని లేదంటే చాలా రకాల సమస్యలకు గురికావడం ఖాయమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంతేకాదు రాత్రి తొందరగా నిద్రపోయి తెల్లవారుజామున నిద్రలేచినట్లయితే రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారని, దీర్ఘకాలం పాటు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా జీవిస్తారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Flash...   పాలలో షుగర్ కు బదులు ఇవి కలపండి.. టేస్ట్ కి టేస్ట్.. ఆరోగ్యానికీ మంచిది