AP NEW DEOs: తోమ్మిది జిల్లాలకు కొత్త DEO ల నియామకం

 తొమ్మిది జిల్లాలకు కొత్త DEO ల నియామకం

అమరావతి: రాష్ట్రంలో తొమ్మిది జిల్లాలకు జిల్లా విద్యాధికారుల (డీఈఓ) ను కొత్తగా నియమిస్తూ పాఠ శాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వులి చ్చారు. వెయిటింగ్ లో ఉన్న ముగ్గురితోపాటు మరో ఐదు గురికి పోస్టింగులు ఇచ్చారు. ప్రకాశం డీఈఓ విజయభాస్క ర్ను బదిలీ చేసిన ప్రభుత్వం ఆయనకు ఎక్కడా పోస్టింగు ఇవ్వలేదు. ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని సూచించింది. ఐటీడీఏ పాడేరు డీఈఓ డాక్టర్ పి రమేష్ను నెలూరులోని డైట్ ప్రిన్సిపల్గా బదిలీ చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల నమోదులో అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గ లేదనే విమర్శలతో బదిలీ అయిన డీఈఓలు పి. రమేష్, కె. శామ్యూల్కు ఎట్టకేలకు పోస్టింగులు ఇచ్చారు.

Download Government order 

Flash...   నూతన విద్యా విధానం పై స్టే విధించండి