Earthquake in Delhi: ఢిల్లీలో భూకంపం

New Delhi: Earthquake occurred in the capital city of New Delhi

An earthquake measuring 5.2 on the Richter scale struck Bajura, Nepal today at 1:45 pm, Nepal’s National Earthquake Monitoring & Research Center said. According to media reports, the earthquake hit parts of Delhi NCR and UP

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో బుధవారం భూకంపం సంభవించింది. నేపాల్ మధ్యలో సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.8గా నమోదైంది. జాతీయ మీడియా కథనాల ప్రకారం నేపాల్‌లో ఈ భూకంపం తీవ్రత 5.2గా నమోదైంది. ఉత్తరప్రదేశ్‌లోనూ ఈ ప్రభావం కనిపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. నేపాల్‌లోని బజురాలో బుధవారం మధ్యాహ్నం 1.45 గంటలకు భూకంపం సంభవించినట్లు నేపాల్ నేషనల్ ఎర్త్‌క్వేక్ అబ్జర్వేటరీ అండ్ రీసెర్చ్ సెంటర్ వెల్లడించింది.

బుధవారం మధ్యాహ్నం 1:30:23 గంటలకు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా మరియు ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లలో భూకంపం ప్రభావం కనిపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ నివేదించింది. భూకంప కేంద్రం హరిద్వార్‌లో ఉన్నట్లు సమాచారం.

ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు

Flash...   Compassionate Appointment: కారుణ్య నియామకం సంపూర్ణ హక్కు కాదు