EPFO | అధిక పెన్షన్ పొందేందుకు ఎవరు అర్హులు? ఎలా అప్లై చేసుకోవాలి?
EPFO | సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు అధిక పెన్షన్‌కు ఆప్ట్ చేసుకునే మార్గాదర్శకాలను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) విడుదల చేసిన సంగతి తెలిసిందే. వేతన జీవులకు ఈ అంశంపై ఎన్నో సందేహాలు తలెత్తుతున్న నేపథ్యంలో వివరణలివి..
EPFO |సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు అధిక పెన్షన్‌కు ఆప్ట్ చేసుకునే మార్గాదర్శకాలను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) విడుదల చేసిన సంగతి తెలిసిందే. వేతన జీవులకు ఈ అంశంపై ఎన్నో సందేహాలు తలెత్తుతున్న నేపథ్యంలో వివరణలివి..
ప్రస్తుత పెన్షన్ విధానం ఇదీ
నిజానికి ఈపీఎఫ్ చట్టం 1952 ప్రకారం పెన్షన్ ఇచ్చే స్కీము ఏదీ లేదు. చట్ట సవరణల తర్వాత 1995 నుంచి ఈపీఎఫ్‌ఓ ప్రత్యామ్నాయ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ అమల్లోకి వచ్చింది. దీని కింద ప్రావిడెంట్ ఫండ్ (పిఎఫ్) కోసం యాజమాన్యాలు జమచేసే డిపాజిట్‌లో 8.33 శాతం పెన్షన్ నిధికి మళ్లిస్తున్నారు. ఉద్యోగి వేతనం (బేసిక్+ డీఏ)లో 12 శాతం చొప్పున ఉద్యోగులు, యాజమాన్యాలు ఈపీఎఫ్‌కు చెల్లిస్తుండగా, ఉద్యోగి వాటా మొత్తం అంతా పీఎఫ్ ఖాతాలోకి వెళుతుంది. యాజమాని 12 శాతంలో 3.67 శాతం ఈపీఎఫ్‌కు, 8.33 శాతం ఈపీఎస్‌కు మళ్లిస్తున్నారు. దీనికి తోడు ఉద్యోగి పెన్షన్ కోసం కేంద్ర ప్రభుత్వం 1.16 శాతం ఇస్తుంది. ఈపీఎస్ ప్రవేశపెట్టినపుడు గరిష్ఠ పెన్షన్‌బుల్ వేతనాన్ని నెలకు రూ. 5,000గా నిర్దేశించారు. తర్వాత దానిని రూ.6,500కు పెంచారు. 2014 సెప్టెంబర్ 1 నుంచి దీనిని రూ. 15,000 చేశారు. అంటే ఈ వేతనంపై పెన్షన్ నిధికి వెళ్లేది రూ.1,250 (8.33 శాతం). పెన్షన్‌బుల్ వేతనాన్ని మించి వాస్తవ బేసిక్ వేతనంపై ఈపీఎఫ్‌కు చెల్లించే ఆప్షన్‌ను ఉద్యోగి, యాజమాని కలిపి తీసుకునే సౌలభ్యం
ఇప్పుడు పెన్షన్ ఎవరికొస్తోంది, ఎంత?
కనీసం పదేండ్ల సర్వీస్ ఉంది, 58 ఏండ్ల వయస్సు తర్వాత ఈపీఎస్ ఉద్యోగులకు పెన్షన్ ఇస్తున్నది. 50-57 సంవత్సరాల మధ్య ఉద్యోగాన్ని వదిలిపెట్టినవారు ముందు నుంచే పెన్షన్ కోరవచ్చు. కానీ అది తక్కువ ఉంటుంది. నెలవారీ పెన్షన్ లెక్కించే ఫార్ములా:నెలవారీ పెన్షన్=పెన్షన్‌బుల్ సెలరీXపెన్షన్‌బుల్ సర్వీస్/70. 2014 సవరణల ప్రకారం ఉద్యోగం నుంచి వైదొలిగేముందు 60 నెలల సగటు వేతనాన్ని పెన్షన్‌బుల్‌గా లెక్కిస్తారు.
2014లో జరిగిన సవరణలేంటి?
పెన్షన్‌బుల్ సెలరీ పరిమితిని రూ.6,500 నుంచి రూ. 15,000కు పెంచడంతో పాటు.. ఈ పరిమితికి మించి కూడా యాజమాన్యాలతో కలిసి ఉద్యోగులు వారి వాస్తవ వేతనాల్లో 8.33 శాతాన్ని ఈపీఎస్‌కు చెల్లించినట్లు అంగీకరించారు. ఈ సవరించిన స్కీమ్‌కు ఆప్ట్ చేసుకునేందుకు 2014 సెప్టెంబర్ 1న ఈపీఎస్ సభ్యులందరికీ ఆరు నెలల గడువు ఇచ్చారు. ప్రాంతీయ ప్రావిడెంట్ కమిషనర్ మరో 6 నెలల గడువును పొడిగించేందుకు అనుమతించారు. వాస్తవ జీతంపై పెన్షన్ కోసం ఆప్ట్ చేసుకునే సభ్యులు పెన్షన్ ఫండ్‌కు అదనంగా వారి జీతం నుంచి 1.16 శాతం చెల్లించాలని నిర్ణయించారు. గడువులోపు వాస్తవ జీతంపై పెన్షన్‌నుట్ చేయనివారికి…అప్పటికే పెన్షన్‌కు అదనంగా చెల్లించిన ఫండ్ ఖాతాకు బదిలీ చేశారు.
అధిక పెన్షన్ కోసం డిపాజిట్ చేయాలా?
ఉద్యోగి ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో అధికంగా జమచేసి ఉన్న/బదిలీ చేసిన పెన్షన్ ఖాతాలోకి మళ్లిస్తారు. ఉద్యోగి ఇంతకు ముందే పీఎఫ్‌ను విత్‌డ్రా చేసుకుని, అధిక పెన్షన్‌కు ఆప్ట్ చేస్తే, నిర్దేశిత పెన్షన్ ఖాతాలో డిపాజిట్ చేయమంటూ ఉద్యోగిని ఈపీఎఫ్‌ఓ కోరుతుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
అధిక పెన్షన్ పై తలెత్తే ప్రశ్నలు..సమాధానాలు
సెప్టెంబర్ 1, 2014కు ముందు రిటైర్ ఈ తేదీ ముందు రిటైర్ అయినవారు సర్వీస్‌లో ఉన్నపుడు అధిక పెన్షన్‌ను అయితే ఇప్పుడు అధిక పెన్షన్ కోరవచ్చా?
ఈ తేదీ ముందు రిటైర్ అయినవారు సర్వీస్‌లో ఉన్నప్పుడు అధిక పెన్షన్‌ను ఆప్ట్ చేసి, దానిని ఈపీఎఫ్‌ఓ తిరస్కరించినట్లయితే ఇప్పుడు కోరవచ్చు.
సెప్టెంబర్ 1, 2014నాడు, అటుతర్వాత రిటైర్ అయితే అధిక పెన్షన్‌ను అర్హులేనా?
వీరు ఈపీఎఫ్ ఖాతాకు వాస్తవ జీతంపై1 చెల్లింపులు చేసి కూడా 20 సెప్టెంబర్‌లో 1కి ముందు అధిక పెన్షన్‌కు అప్ట్ చేసి ఉండకపోతే, చేయవచ్చు.
ప్రస్తుత సర్వీసులో ఉన్నవారు ఆప్ట్ చేసుకోవచ్చా?
2014 సెప్టెంబర్ 1కి ముందు ఉద్యోగంలో చేరి, ప్రస్తుతం కూడా వాస్తవ వేతనంపై ఈపీఎఫ్‌కు చెల్లింపులు చేస్తూ ఆ తేదీకి ముందు అధిక పెన్షన్‌కు ఎంపిక చేయకపోతే, ఇప్పుడు చేయవచ్చు.
సెప్టెంబర్ 1, 2014 తర్వాత సర్వీస్‌లో చేరినవారు ఇప్పుడు ఆప్ట్ చేయవచ్చా?
ఎంపిక చేసే అర్హత లేదు
ఈపీఎఫ్ చట్టంలో పేరా 26(6) అంటే?
సభ్యుడు చట్టబద్ద పరిమితి కంటే ఈపీఎఫ్‌కు ఎక్కువ చెల్లించే ప్రొవిజన్‌ను ఈ పేరా కల్పిస్తుంది. సభ్యులు, యజమాన్యం ఉమ్మడిగా రాతపూర్వకంగా దరఖాస్తు సమర్పించాలి. దీనిని ఏపీఎఫ్‌సీ ర్యాంక్‌కు తక్కువకాని అధికారి ఆమోదించాలి.
ఇప్పుడు ఎక్కువ పెన్షన్‌ను కోరాలంటే పేరా 26(6) కింద ఆప్ట్ చేయడం తప్పనిసరా?
అవును. పేరా (26)6 కింద చట్టబద్దమైన పరిమితిని మించిన వాస్తవ జీతంపై ఈపీఎఫ్‌కు చెల్లింపులు జరుగుతున్న తేదీని ప్రస్తావిస్తూ అధిక పెన్షన్ కోసం ఆప్ట్ చేయవచ్చు
ఇంతకూ ఎవరు, ఇప్పుడు అధిక పెన్షన్‌కు ఎంపిక చేయవచ్చా?
(ఏ) 2014 సెప్టెంబర్ 1కి ముందు సర్వీస్ నుంచి వైదొలిగి, ఉద్యోగంలో ఉన్నపుడు అధిక పెన్షన్‌కు ఆప్ట్ చేసి, ఈపీఎఫ్వో ద్వారా తిరస్కరణకు గురైన వారు.
(బీ) 2014 సెప్టెంబర్ 1న లేదా ఆ తర్వాత సర్వీస్‌లో ఉండి, వాస్తవ జీతంపై ఈపీఎఫ్‌కు చెల్లింపులు జరుపుతూ, అధిక పెన్షన్‌కు ఆప్ట్ చేయనివారు.
అధిక పెన్షన్ ఆప్షన్‌ను అర్హులు కానివారు ఎవరు?
(ఏ) ఎటువంటి ఆప్షన్ ఎంపికచేయకుండా 2014 సెప్టెంబర్ 1కి ముందు సర్వీస్ నుంచి వైదొలిగినవారు.
(బీ) చట్టబద్దమైన వేతన పరిమితిపైనే ఈపీఎఫ్‌కు చెల్లింపులు చేస్తున్నారు.
(సీ) 2014 సెప్టెంబర్ 1 తర్వాత సర్వీస్‌లో చేరినవారు.
పింఛను ఎంతకాలం ఉంటుంది?
EPFO సభ్యుడు జీవితకాలం పెన్షన్ పొందుతారు. మరణానంతర ప్రయోజనాలు ఉద్యోగిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు అందుతాయి.
నేను 2014లో EPFOకి చెల్లింపులు చేయకుంటే నేను అధిక పెన్షన్‌ని ఎంచుకోవచ్చా?
సెప్టెంబర్ 1, 2014 నాటికి, మీరు EPS సభ్యత్వం నుండి ఉపసంహరించుకోకపోయినా మరియు 2014లో చెల్లింపులు చేయకపోయినా మీరు అధిక పెన్షన్‌ను ఎంచుకోవచ్చు.