15.02.2023 తేదీన గౌరవ RJD (SE) గుంటూరు వారు ఇచ్చిన ముఖ్య సూచనలు
1. అకడమిక్ క్యాలండర్ ప్రకారము అన్ని తరగతుల /విషయాల వారీగా సిలబస్ పూర్తి చేయవలెను.Lesson Plans / Teachers డైరీ ఉండాలి…
2. Work books, Note books ను సంబంధిత ఉపాధ్యాయుడు Correct చేసి తప్పలు ఉంటే సరిచేసి తేదీ వేసి సంతకం చేసి ఉండాలి..
3. తరగతిలోని అందరు విద్యార్థులు అన్నీ విషయాలకి (Subject) నోట్స్ వ్రాయవలెను. సంబంధిత ఉపాద్యాయులు Correction చేయవలెను సిలబస్ పూర్తి అయినంతవరకు Note books పూర్తి చేసి ఉండవలెను.
4. పాఠశాలలో /తరగతి గదిలో ఎటువంటి Guides ని ఉంచరాదు. CCE Method వచ్చిన తరువాత Guides ని నిషేదించడమైనది. పాఠశాలలో Guides ఉండరాదు.
5. బైజూస్ Tabs విషయంలో ప్రతి విద్యార్ధి, ఉపాద్యాయుడు కనీసము 2000 నిమిషములు ఉపయోగించి ఉండవలెను. కనుక వెనుకబడి ఉంటే ఈరోజు, రేపు పూర్తిగా వినియోగించిన తరువాత రేపు సాయంకాలము లో Enter చేయవలెను . బైజూస్ Tab వల్ల పిల్లలకు ఏమి ఉపయోగమో పిల్లలు చెప్పగలిగి ఉండాలి.
6 స్కూల్ క్యాంపస్ అంతా క్లీన్ గా ఉంచుకోవాలి. చెత్త చెదరము లేకుండా చూసుకోవాలి. తరగతులు కూడా నీటుగా క్లీన్ గా ఉంచుకోవాలి. వంట గది ప్రాంతంలో కూడా శుబ్రంగా ఉండాలి.
7. MDM Menu Display చేయాలి. Toll ఫ్రీ numbers /కంప్లెయింట్ బాక్స్ కి తాళం వేసి ఉంచాలి.
8. Toilet Cleaning సమయములు (Timings) గోడ మీద వ్రాసి ఉంచాలి.
9 15.02.2023 నుండి 17.02.2023 వరకు అత్యవసరములో తప్ప సెలవులు మంజూరు చేయరాదు. (During principal secretory visits only)
10. నాడు నేడు కి సంబందించి ప్రధానోపాధ్యాయులకి పూర్తి అవగాహన కలిగి ఉండాలి Phase -I Phase -II
11. FA-1, FA-2, FA-3, SA-1 పరీక్షల మార్కులు అప్లోడింగ్ పూర్తి అయిఉండవలెను. FA-III ఆన్సర్ Scripts వాల్యుయేషన్ పూర్తి చేసి ఉండవలెను. Topper ని Appreciate చేయవలెను వారి పేర్లు Display చేయవలెను .
12. పాఠశాలలోని ప్రతి రికార్డు Update గా ఉంచవలెను. Water Plant Repairs ఉంటే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి Repairs చేయించవలెను.
Read: Register / Records and Academic Activities to be Observed while Principal Secretory Visit