SBI: రెండు శుభవార్తలు, రెండు చేదు వార్తలు.. ఏం ప్రకటనలు చేసిందంటే?

 SBI: రెండు శుభవార్తలు, రెండు చేదు వార్తలు.. SBI ఎఏం ప్రకటనలు చేసిందంటే?

SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను (ఎSBI FD రేట్ల పెంపు) పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇది 5 బేసిస్ పాయింట్ల నుండి 25 బేసిస్ పాయింట్ల వరకు ఉంటుంది. రూ.2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై పెరిగిన వడ్డీ రేట్లు వర్తిస్తాయి. అలాగే ఇవి డిపాజిట్ కాలపరిమితిని బట్టి మారుతూ ఉంటాయి. పెరిగిన వడ్డీ రేట్లు నేటి నుంచి అంటే ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించగా.. అదే సమయంలో మరో శుభవార్త కూడా వచ్చింది. అదే కొత్త FD పథకం. 400 రోజుల కాలపరిమితితో కొత్త ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించిన ఎస్‌బీఐ.. 7.10 శాతం వడ్డీ రేటును అందిస్తున్నట్లు స్పష్టం చేసింది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు ఎక్కువ ప్రయోజనం పొందుతారు.


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చివరిసారిగా డిసెంబర్ 13, 2022న FD రేట్లను పెంచింది. ఆ తర్వాత కాలపరిమితిని బట్టి గరిష్టంగా 65 బేసిస్ పాయింట్ల వరకు పెరిగింది. అయితే.. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచగా.. బ్యాంకులు ఇతర రుణాలతో పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. దీంతో బ్యాంకుల్లో డబ్బులు ఉంచే వారికి మరింత ప్రయోజనం చేకూరనుంది.

Also Read: నెలకు రూ. 200 పొదుపు చేస్తే.. రూ. 10 లక్షలు సొంతం

పెరిగిన వడ్డీ రేట్ల ప్రకారం ఇక నుంచి SBI లో ఏడాది నుంచి రెండేళ్ల కాలపరిమితి కలిగిన FD లపై వడ్డీ రేటు గతంలో 6.75 శాతం ఉండగా, ఇప్పుడు 6.80 శాతానికి పెరిగింది. ఇది సాధారణ కస్టమర్లకు అయితే, సీనియర్ సిటిజన్లకు దీని కంటే ఎక్కువ లభిస్తుంది. వీరికి అత్యధికంగా 7.30 శాతం వడ్డీ లభించడం విశేషం. 400 రోజుల కాలవ్యవధితో కొత్తగా ప్రకటించిన SBI FD పథకం ఈరోజు ప్రకటించబడింది. ఈ స్కీమ్‌లో చేరాలనుకునే వారికి మార్చి 31, 2023 వరకు గడువు ఉందని, దీనిపై గరిష్టంగా 7.10 శాతం వడ్డీ అందుతుందని స్పష్టం చేశారు.

Flash...   Child Care Leave for Women employees - Child Care leave Application

Also Read: హిండెన్‌బర్గ్ రిపోర్ట్ ఏమిటి ? అదానీ మరియు హిడెన్‌బర్గ్ ఎవరు?

ఇక అదే SBI మరో బ్యాడ్ న్యూస్ కూడా చెప్పింది. ఆ రుణాలపై వడ్డీ రేటు పెరుగుతోంది. తాజాగా రుణ రేటు (MCLR)ను 10 బేసిస్‌ పాయింట్లు పెంచింది. ఫలితంగా, MCLR రేటుతో అనుసంధానించబడిన రుణాలపై వడ్డీ రేటు పెరుగుతుంది. మొన్న మరో బ్యాడ్ న్యూస్ ఇచ్చిన సంగతి తెలిసిందే. SBI క్రెడిట్ కార్డ్ ఉపయోగించి అద్దె చెల్లింపుల కోసం ప్రాసెసింగ్ ఫీజును రూ. 99 నుండి రూ. 199కి 100 శాతానికి పైగా పెంచింది. దీనికి GST అదనం. దీంతో.. FD లపై రెండు శుభవార్తలు.. రుణాలపై బ్యాడ్ న్యూస్ మరియు క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్.

Also Read: PAN CARD: వినియోగదారులకు హెచ్చరిక..!