ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా? క్యాన్సర్‌తో పాటు ఆ రోగాలకు ఛాన్స్!

 ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌లో వండిన అన్నం తింటున్నారా? క్యాన్సర్‌తో
పాటు ఆ వ్యాధులకూ అవకాశం!!

ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌లో వంట చేస్తున్నారా? ఆ అన్నం తినడం ప్రమాదకరమని
వైద్య నిపుణులు అంటున్నారు. ఇటీవల చాలా మంది ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌లో అన్నం
వండుతున్నారు. 
పట్టణాలకే కాదు పల్లెలకు కూడా విస్తరించింది. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌లో
వండిన ఆహారాన్ని తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు
హెచ్చరిస్తున్నారు.

ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌లో అన్నం వండితే అనారోగ్యాలు

ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో వండిన అన్నం తింటే చిన్న వయసులోనే కాళ్ల నొప్పులు,
కీళ్ల నొప్పులు, నడుము నొప్పి వంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌లో వండిన అన్నంలో పోషకాలు పోతాయని, వండేటప్పుడు అందులో
నుంచి ప్రమాదకరమైన రసాయనాలు విడుదలవుతాయని చెబుతున్నారు. ఎలక్ట్రిక్ రైస్
కుక్కర్‌లో వండిన అన్నం తింటే వారికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని
హెచ్చరిస్తున్నారు.

 నాన్ స్టిక్ కోటింగ్ రైస్ కుక్కర్లతో యమ డేంజర్

వంటలో అల్యూమినియం పాత్రలు వాడకూడదని, మరీ ముఖ్యంగా నాన్ స్టిక్ కోటింగ్ ఉన్న
రైస్ కుక్కర్లను ఉపయోగించకూడదని సూచించారు. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ కంటే
ప్రెషర్ కుక్కర్ మంచిదని అంటున్నారు. అన్నం త్వరగా వండాలంటే ప్రెషర్ కుక్కర్‌లో
వండుకోవాలని సూచించారు. కరెంట్ ఆధారంగా ఉడకబెట్టిన అన్నం తినకపోవడమే
మంచిదన్నారు. మట్టి పాత్రలు, స్టీలు పాత్రల్లో వండుకుని తింటే మంచిదని
చెబుతున్నారు. మట్టి కుండలో వండుకుని తినడం వల్ల భూమిలోని పోషకాలు ఆహారానికి
రుచిగా ఉంటాయన్నారు.

 ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌లో వండితే పోషకాలు ఉన్నాయా?

ప్రెషర్ కుక్కర్‌లో అన్నం వండడం వల్ల కూడా ఆహారంలో పోషకాలు ఉంటాయని, అయితే
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌లో వండడం వల్ల ఆహారంలోని పోషకాలన్నీ
కేంద్రీకృతమవుతాయని చెబుతున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌లో వండిన ఆహారం తింటే రోగాలబారిన పడతారని
హెచ్చరిస్తున్నారు. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌లకు వీడ్కోలు చెప్పి నేరుగా
స్టవ్‌పై అన్నం వండండి.

Flash...   గోధుమ రవ్వ ఉప్మా ప్రయోజనాలు తెలిస్తే తినేస్తారు

Disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న
అంశాల ఆధారంగా రూపొందించబడింది. teacherinfo దీన్ని ధృవీకరించలేదు