టీచరుకు టార్చర్! తరగతి గదుల్లోనే కుప్పకూలిపోతున్నారు… !

 

ఒకప్పుడు పాఠం చెప్పడమే బాధ్యత 

ఇప్పుడు ఒక్కొక్క 30 బాధ్యతలు 
నామమాత్రంగా మారిన బడి, 
బోధన పని యాప్ లు, ఫొటోలు, ట్యాబ్ లతో సతమతం 
ముఖ హాజరు కంగారులో ప్రాణాలపైకి.. 
ఇంటికొచ్చినా తీరిక ఇవ్వని వర్క్  
కుటుంబాలతో గడపలేని దుస్థితి 
పర్యటనలతో ఉన్నతాధికారుల హడావుడి ,
చిన్న లోపమున్నా చీవాట్లు, నోటీసులు ఫలితంగా ధైర్యం కోల్పోతున్న గురువులు వారిలో పెరిగిపోతున్న హృద్రోగ
సమస్యలు ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర కలకలం.

అమరావతి, మార్చి 4 (ఆంధ్రజ్యోతి) / గుంటూరు (విద్య): టీచర్ అంటే ఏం పని
ఉంటుంది! సరదాగా వెళ్లి నాలుగు పాఠాలు చెప్పి ఇంటికి రావడమేగా అని గతంలో
ప్రభుత్వ ఉపాధ్యాయులపై ఓ ముద్ర ఉండేది. అందులో కొంత వాస్తవం కూడా ఉంది. కేవలం
బోధన పనులకే పరి మితమైనంత కాలం టీచర్లు ప్రశాంత వాతావరణాన్నే గడి పారు. కానీ
వైసీపీ అధికారంలోకి వచ్చాక టీచర్ అంటే ఇన్ని పనులుంటాయా? అనే పరిస్థితి
ఏర్పడింది. పిల్లలకు వైవి. ధ్యంగా ఎలా బోధించాలనే కొత్త ఆలోచనలకు స్వస్తి పలికి
ఈరోజుకు పనులన్నీ పూర్తిచేసుకున్నామా? లేదా? అని ప్రైవేటు ఉద్యోగుల తరహాలో
గడియారం చూసుకునే దుస్థితి వచ్చింది. ఇందుకు ప్రధాన కారణం టీచ ర్లపై బోధనేతర
పనుల భారం. ఉదయం బడికి వచ్చిన వెంటనే బాత్రూమ్ ఫొటోలు మొదలు హాజరు, మధ్యాహ్న
భోజనం, వాటి సరుకుల దిగుమ తులు, నాడు-నేడు ఫొటోలు… ఇలా అనేక బోధనేతర పనులు
టీచర్లను ముప్పతిప్పలు పెడుతున్నాయి. దీంతో బోధనకు సంబంధించిన పనులకు సమయం
కుంచించుకుపోతోంది.

ఉరుకులు పరుగులు

టీచర్లు సక్రమంగా బడులకు రావట్లేదన్న ఉద్దే శంతో జగన్ ప్రభుత్వం ఫోన్ ద్వారా
ముఖహాజరు నమోదుచేసే విధానం ప్రవేశపెట్టింది. దీంతో ఏది ఏమైనా ఉదయం 9గంటలకల్లా
టీచర్లు బడిలో ఉండాలి. వాస్తవానికి ముఖహాజరు లేకపోయినా ఆ సమయానికే బడిలో
ఉంటారు. కాకపోతే ఏదైనా ఒక రోజు వర్గం, ట్రాఫిక్, ఇతరత్రా అనుకోని కారణాలతో
ఆలస్యం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడేమో ఉద యాన్నే ఉరుకుల పరుగులతో టీచర్లు బడులకు
వెళ్తు న్నారు. ముఖహాజరు అమల్లోకి వచ్చాక చాలా మంది మహిళా టీచర్లు ఆలస్యం
కాకూడదనే ఉద్దేశంతో ద్విచక్ర వాహనాలపై బడికి వెళ్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలు
జరుగుతున్నాయి.

Flash...   IRCTC: కేరళ అందాల కోసం తక్కువ ధరలో ప్రత్యేక ప్యాకేజీ .. కేరళ ప్రకృతి అందాలు చూసెయ్యండి..

Also Read: ఇవి తింటే కొవ్వుని కోసి  తీసినట్లే..  హార్ట్ అటాక్,  బ్రెయిన్ స్ట్రోక్ రానే రావు !

చర్యలే చర్యలు…

ఇటీవల కాలంలో టీచర్లపై మరింత ఒత్తిడి పెరి గింది. పాఠాలు చెప్పి సిలబస్
పూర్తిచేయడంతోనే టీచరు బాధ్యత తీరిపోవడం లేదు. పిల్లలు సక్ర మంగా వర్క్ బుక్ లు
రాశారా? వాటిలో తప్పులు న్నాయా? అనేది కూడా టీచరు చూడాలి. ప్రతిరోజూ పిల్లలకు
ఏం పాఠం చెప్పబోతున్నారనేది ముందు గానే పాఠ్యప్రణాళిక రాసుకోవాలి. పరీక్షలు
ముగిసిన వెంటనే పేపర్లు దిద్ది పిల్లలకు ఇవ్వాలి. అవకాశం ఉంటే పిల్లలతో సెల్ఫీ
దిగి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయాలి. సకాలంలో విద్యా కానుక కిట్లు పంపిణీ
పూర్తిచేయాలి. పిల్లలంతా వాటిని వినియోగి చేస్తున్నారా? లేదా? అనేది
పర్యవేక్షించాలి. ఇలా తలకు మించిన భారాన్ని టీచర్ల నెత్తిన పెడుతున్నారు.
వీటిలో ఏ ఒక్క లోపం కనిపించినా ఉన్నతాధికారులు చర్యలకు ఆదేశిస్తున్నారు. దీంతో
ఏ రోజు తమపై వేటు పడుతుందోనని టీచర్లు బెంబేలెత్తిపోతున్నారు.

కుటుంబానికి సమయమేదీ?

రేషనలైజేషన్ పేరుతో టీచర్లపై పనిభారం పెంచారు. రోజులో ఆరుకు తగ్గకుండా
పీరియడ్లు బోధించాలి. దీంతో పాఠ్య ప్రణాళికలు రాసుకోవడం, పేపర్లు దిద్దడానికి
బడిలో తీరిక ఉండటం లేదు. దీంతో చాలా మంది ఆ పనులు ఇంటి వద్ద చేస్తు న్నారు.
ప్రతిరోజూ విద్యార్థులకు హోంవర్క్ ఉన్నా లేకపోయినా టీచర్లకు మాత్రం ఉంటోంది.
దీంతో కుటుంబాలతో గడిపే సమయం కూడా దొరకట్లేదని టీచర్లు ఆవేదన వ్యక్తం
చేస్తున్నారు. ఇవి చాలవ కొత్త బైజస్ ట్యాబ్ ల భారం మోపారు. ప్రతిరోజూ వాటిని
చూడాలనే కండీషన్ పెట్టారు.

Also Readమార్చి నెల “లెర్న్ ఏ వర్డ్ ఏ డే” పదాల జాబితా

బిక్కుబిక్కుమంటూ…

దాదాపు 30 రకాల బాధ్యతలు టీచర్లపై ఉన్నాయి. ఇటీవల ఉన్నతాధికారుల తనిఖీల్లో
వాటిలో ఏవైనా లోపాలుంటే షోకాజు నోటీసులు జారీచేస్తున్నారు. కొందరైతే
సస్పెన్షన్లకు గురౌతున్నారు. దీంతో బడికి వెళ్లాక ఎవరు తనిఖీలు చేస్తారో? ఏ
లోపాలు పట్టు కుంటారో అనే భయం! ‘మా పాఠశాలలో 90శాతం పనులన్నీ సమయానికి
పూర్తిచేస్తున్నాం. అయినా ఎక్కడో ఒకచోట చిన్నపాటి లోపాలుంటాయి. కానీ
ఉన్నతాధికారుల పర్యటనలంటేనే వణికిపోయే పరి స్థితి వస్తోంది. ఏది పట్టుకుని
నిలదీస్తారోననే భయం ‘టీచర్లలో ఉంది’ అని ఓ ఉన్నత పాఠశాల టీచర్ ఆందోళన
వ్యక్తంచేశారు.

Flash...   క్రెడిట్ కార్డుతో అద్దె చెల్లిస్తే అమేజింగ్‌ బెనిఫిట్స్‌.. ప్రాసెస్ తెలుసుకోండి.. Credit Cards Benefits

కుప్పకూలిపోతున్నారు…

➧ బాపట్ల జిల్లాలో పిల్లలకు పాఠాలు చెబుతూ టీచర్ తరగతి గదిలోనే ఒక్కసారిగా
కుప్పకూలి పోయాడు. గుండెపోటుకు గురైన ఆయన కొద్ది సేపట్లోనే తుది శ్వాస
విడిచాడు. 

➧ బడికి తొంద రగా చేరుకుని ముఖహాజరు వేయాలనే కంగా రులో స్కూటీ
నడుపుతూ….పల్నాడు జిల్లాలో ఓ మహిళా టీచర్ ప్రమాదానికి గురై ప్రాణాలు
విడిచారు. 

➧ అదే జిల్లా గురజాలలో ఓ ఉపాధ్యా యుడు ఆత్మహత్య చేసుకుని తనువు చాలిం
చాడు. 

➧ నెల రోజుల కిందట తూర్పుగోదావరి జిల్లాలో నాడు- నేడు పనిఒత్తిడి తట్టుకోలేక ఓ
ప్రధానోపాధ్యాయుడు రైలు కింద పడి ఆత్మ హత్య చేసుకున్నాడు.