పాఠశాలలో దొంగలు పడ్డారు.. ఏం ఎత్తుకుపోయారో తెలుసా !

 పాఠశాలలోకి ప్రవేశించిన దొంగలు.. విద్యార్థుల కోసం ఉంచిన 12 ట్యాబ్‌లను అపహరించారు.


పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం రాయకుదురు జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన దోపిడీ కలకలం రేపుతోంది. ఆదివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు.

ఉపాధ్యాయుల గదిలోని అల్మారాలో భద్రపరిచిన 12 ట్యాబ్‌లను గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. ఈ విషయం తెలుసుకున్న పాఠశాల ఇన్‌ఛార్జ్‌, ప్రిన్సిపాల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఏఎస్సై ధర్మారావు కేసు నమోదు చేశారు. భీమవరం రూరల్ సీఐ సీహెచ్ నాగప్రసాద్ దర్యాప్తు చేస్తున్నారు. అయితే చోరీ జరిగిన ప్రదేశానికి క్లూస్ టీం సిబ్బంది వచ్చి వేలిముద్రలు సేకరించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

Source : TV9 Telugu

Flash...   GIS MAPPING NOT DONE SCHOOLS AND COLLEGES