స్మార్ట్ ఫోన్ ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా మంది ఐదు నిమిషాలు కూడా ఫోన్ లేకుండా బోర్‌గా ఫీల్ అవుతారు. ఛార్జింగ్ కోసం ఫోన్‌ని గంట నుంచి రెండు గంటల పాటు పక్కన పెట్టడం చాలా మందికి నచ్చని విషయం. అందుకే కొందరు చార్జింగ్ పెట్టి మరీ చూసుకుంటున్నారు. రెడ్ మీ ఈ సమస్యలకు పరిష్కారాన్ని కనుగొంది.
కేవలం ఐదు నిమిషాల్లో ఫోన్‌ను ఛార్జ్ చేసే 300 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని రెడ్‌మీ ఆవిష్కరించింది. ఇది 4,100 mAh బ్యాటరీని 5 నిమిషాల్లో ఛార్జ్ చేస్తుంది. దీనికి సంబంధించిన వీడియో చైనీస్ సోషల్ మీడియా యాప్ వీబోలో కనిపించింది. రెడ్ నోట్ 12 డిస్కవరీ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ 300 వాట్ ఛార్జర్‌తో 4,100 mAh బ్యాటరీతో పనిచేస్తుంది. అసలు ఫోన్‌లో 4,300 mAh బ్యాటరీ ఉంటే, 4,100 mAh బ్యాటరీ ఐదు నిమిషాల్లో ఛార్జింగ్ పరీక్షను పూర్తి చేయడానికి ఉపయోగించబడింది.
కేవలం 3 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్‌ని పూర్తి చేసింది. చైనాకు చెందిన రియల్‌మి కూడా ఇటీవలే 240 వాట్ల ఫాస్ట్ ఛార్జర్ టెక్నాలజీని ప్రవేశపెట్టడం గమనార్హం. ఈ ఛార్జర్‌తో, 4,600 mAh బ్యాటరీని కేవలం 9 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు. త్వరలో ఈ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా మనకు అందుబాటులోకి రానుంది.