Ayushman Bharat – నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ మిషన్ ద్వారా రూ. ఒక్కో
కుటుంబానికి ఏడాదికి 5 లక్షలు.
గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారు ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భవ
పదకం ప్రస్తుతం ABHA హెల్త్ కార్డు గా మార్చబడింది. ఇందులో రిజిస్టర్ అయిన
వారికి కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఐదు లక్షల రూపాయల ఆయుష్మాన్ ABHA హెల్త్
కార్డ్ లభిస్తుంది. 5 లక్షల రూపాయల ఆరోగ్య భీమా లభిస్తుంది.
Steps to Register:
పైన ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి మీ ఆధార్ నెంబరు టైప్ చేసి సబ్మిట్ చేసిన
తర్వాత ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉన్న ఫోన్ నెంబర్ కు ఓటిపి
వస్తుంది.
ఆ ఓటిపి ని మరల టైప్ చేసిన తర్వాత మీ ఫోన్ నెంబర్ ను టైప్
చేయవలెను.
మీ ఫోన్ నెంబర్ లో నమోదు తదుపరి ఓటిపి వస్తుంది,
ఆ ఓటిపి కూడా నమోదు చేస్తే మీ ఫోటో తో కూడిన ఆయుష్మాన్ హెల్త్ కార్డు మీరు
వెంటనే డౌన్లోడ్ చేసుకోవచ్చు.
దయచేసి ప్రతి ఒక్కరు (ఆయుష్మాన్ ) ABHA హెల్త్ కార్డు పొందవలసిందిగా
కోరుచున్నాము. ABHA హెల్త్ కార్డు కావలిసిన వారి ఆధార్ కార్డ్ నెంబర్ మరియు
ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేసి ఉండవలెను. మీ ఫోన్ నుండే సులభంగా
ఆయుష్మాన్ భారత్ ABHA పథకంలో చేరవచ్చును..
రాష్ట్ర ప్రభుత్వం వారు జారి చేయబడిన హెల్త్ కార్డు ఉన్నప్పటికీ, ABHA హెల్త్
కార్డు పొందవచ్చును.
భారత ప్రభుత్వం వారి ఆయుష్మాన్ హెల్త్ కార్డ్ ప్రతి ఆరోగ్యశ్రీ హాస్పిటల్ లో
చెల్లుబాటు అగును. కేంద్ర
ప్రభుత్వం నుండి ఉచితంగా 5 లక్షల రూపాయల ఆరోగ్య భీమా లభిస్తుంది. అందరు
అప్లై చేసుకొని హెల్త్ కు సంబంధించిన బెనిఫిట్స్ పొందగలరు. అప్లై చేసుకున్న
ఒకే ఒక్క నిమిషాల్లో హెల్త్ కార్డు డౌన్లోడ్ చేసుకొనవచ్చును. కేంద్ర
ప్రభుత్వము వారు ప్రవేశ పెట్టిన ఈ ఉచిత ఆరోగ్య పదకమునకు సంబంధించిన పైన తేలియ
చేసిన విధముగా భార్య మరియు భర్త (wife and husband) కార్డు తీసుకొనవచ్చును.
కావున అందరు నమోదు చేసుకొని ABHA హెల్త్ కార్డు పొందవలసిందిగా
కోరుచున్నాము..
పథకం యొక్క ప్రయోజనాలు దేశవ్యాప్తంగా పథకం కింద కవర్ చేయబడిన
లబ్ధిదారుడు దేశవ్యాప్తంగా ఏదైనా ప్రభుత్వ/ప్రైవేట్ ఎంప్యానెల్ ఆసుపత్రుల నుండి
నగదు రహిత ప్రయోజనాలను తీసుకోవడానికి అనుమతించబడతారు.
* ఆయుష్మాన్ భారత్ – నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ మిషన్ అనేది SECC డేటాబేస్‌లోని
ప్రమాణాల ఆధారంగా నిర్ణయించబడిన అర్హత ఆధారిత పథకం.
* లబ్ధిదారులు పబ్లిక్ మరియు ఎంప్యానెల్ ప్రైవేట్ సౌకర్యాలలో ప్రయోజనాలను
పొందవచ్చు.
* ఖర్చులను నియంత్రించడానికి, చికిత్స కోసం చెల్లింపులు ప్యాకేజీ రేటు
(ప్రభుత్వం ముందుగానే నిర్వచించబడుతుంది) ఆధారంగా చేయబడుతుంది.
* ఆయుష్మాన్ భారత్ – నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ మిషన్ యొక్క ప్రధాన సూత్రాలలో
ఒకటి సహకార ఫెడరలిజం మరియు రాష్ట్రాలకు వశ్యత.
* విధానపరమైన ఆదేశాలు ఇవ్వడం మరియు కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని
పెంపొందించడం కోసం, కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రి అధ్యక్షతన
అత్యున్నత స్థాయిలో ఆయుష్మాన్ భారత్ నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ మిషన్ కౌన్సిల్
(AB-NHPMC)ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించబడింది.
* ఈ పథకాన్ని అమలు చేయడానికి రాష్ట్రాలు రాష్ట్ర ఆరోగ్య సంస్థ (SHA)ని కలిగి
ఉండాలి.
* నిధులు సకాలంలో SHAకి చేరేలా చూసుకోవడానికి, కేంద్ర ప్రభుత్వం నుండి ఆయుష్మాన్
భారత్ – నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ మిషన్ ద్వారా రాష్ట్ర ఆరోగ్య సంస్థలకు నిధుల
బదిలీ నేరుగా ఎస్క్రో ఖాతా ద్వారా చేయవచ్చు.
* NITI ఆయోగ్ భాగస్వామ్యంతో, ఒక బలమైన, మాడ్యులర్, స్కేలబుల్ IT
ప్లాట్‌ఫారమ్ కార్యాచరణను రూపొందించబడుతుంది, ఇది కాగితం రహిత, నగదు రహిత
లావాదేవీని కలిగి ఉంటుంది.
DEO ELURU PROCEEDINGS ON ABHA HEALTH CARDS