DEO PALNADU: ఆయన రూటే సపరేటు సమీక్ష పేరుతో దూషణలు

 ఆయన రూటే సపరేటు సమీక్ష పేరుతో దూషణలు

మండిపడుతున్న ఉపాధ్యాయలోకం

వినుకొండ, న్యూస్టుడే : పల్నాడు జిల్లాలో ఆయనో జిల్లా అధికారి.. విద్యా ప్రమాణాలు పెంచేందుకు నియోజకవర్గాల వారిగా సమావే శాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం స్థానిక సమీక్షలో సమస్యలకు పరిష్కార మార్గాలపై చర్చించి సలహాలివ్వా ల్సిన ఆయన అవమానకరమైన మాటలు మాట్లాడటం ఉపాధ్యాయ వర్గాల్లో చర్చనీయాం శమైంది. యూస్ లెస్ ఫెలోస్ అనడంపై భగ్గు మంటున్నారు. అంతటితో ఆగకుండా నేను CM అయితే మీ జీతాల్లో 70 శాతం కోత పెట్టేవాడిని…మీరు నడిచి వచ్చేటప్పుడు శబ్ధం. వస్తే నాకు అలర్జీ వస్తుందన్న మాటలను కొందరు సామాజిక మాధ్యమాల్లో పెట్టగా ట్రోల్ అవుతున్నాయి. 

సమాజంలో గౌరవించ బడే వృత్తిలో ఉన్న గురువుల ఆత్మాభిమానం దెబ్బతీసే మాటలు అనడంపై భగ్గుమంటు న్నారు. విద్యార్థులను ఇతరులతో పోల్చి కించ పరచడం, తిట్టడం వంటి వాటి జోలికి వెళ్ళవ ద్దని తమకు సూచనలిచ్చే పై అధికారులు వాటిని పాటించాలని కోరుతున్నారు.


Flash...   AP AGRI POLYCET Hall Ticket 2022