Health: ఇవి తింటే కొవ్వుని కోసి తీసినట్లే.. హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్ రానే రావు !

ఈ మధ్య కాలంలో గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్‌లు ఎక్కువయ్యాయి. జనం పిట్టల్లా పడిపోతున్నారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం.

Covid  తర్వాత  ఆరోగ్యంపై అందరి దృష్టి పెరిగింది. డైట్ మారింది. వీలైనంత వరకు జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. అందరూ బాగా వ్యాయామం కొరకు  వర్కవుట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు చాలా మంది యువత ప్రకృతి వైద్యులు చెప్పే చిట్కాలను పాటిస్తున్నారు. వంటగది చిట్కాలతో పాటు వాటి నివారణలు యువతను బాగా ఆకర్షిస్తున్నాయి. రక్తనాళాలలో పేరుకుపోయిన కొవ్వు మరియు చెడు కొలెస్ట్రాల్ చాలా ప్రమాదకరమైనవి. ముఖ్యంగా గుండె, మెదడులో కొవ్వు, కొలెస్ట్రాల్ పేరుకుపోతే గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, చనిపోయే ప్రమాదం ఉంది. అలాంటి కొవ్వును, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు మంతెన  రెమెడీ చెప్పారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఈ కొవ్వు లేదా కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో పేరుకుపోకుండా నిరోధించడంలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. అవిసె గింజల్లో ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ అనే మంచి కొవ్వు కూడా ఉంటుంది. ఇది శరీరానికి చాలా మంచిది. దాదాపు 27 పరిశోధనలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి. రోజూ 25 నుంచి 30 గ్రాముల అవిసె గింజలను 30 రోజుల పాటు తింటే.. హార్ట్ స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు నెల రోజుల్లో 15 శాతం తగ్గుతాయని శాస్త్రీయంగా రుజువైంది. అంతేకాదు గుండెపోటు వచ్చి స్టెంట్లు, బైపాస్ ఆపరేషన్లు చేయించుకున్న వారు… లేదా బ్లాక్స్ ఉన్నవారు కూడా ఈ అవిసె గింజలను రోజుకు 25 గ్రాములు తీసుకుంటే… భవిష్యత్తులో గుండెజబ్బులు వచ్చే ప్రమాదం ఉండదు.

అవిసె గింజలను ఇలా తింటే రుచిగా ఉంటుంది.

ముందుగా అవిసె గింజలను పగలకుండా వేయించి.. పక్కన పెట్టుకోవాలి. తర్వాత గుంటలు తీసిన ఖర్జూర ముక్కలను తీసుకుని అందులో కాస్త తేనె వేసి 2 నిమిషాలు వేడి చేయాలి. తర్వాత అందులో వేయించిన అవిసె గింజలను కలిపి.. లడ్డూలు తయారు చేసుకోవాలి. రోజుకి ఒక్క ఫ్లాక్స్ బ్రౌనీ తింటే కళ్లు తిరగడం రాదు.

Flash...   కరోనాను ఇలా అదుపు చేయొచ్చు-WHO