Rs. 2000 Notes: రూ.2000 నోట్లపై కేంద్రం కీలక ప్రకటన!

Rs. 2000 Notes: రూ.2000 నోట్లపై కేంద్రం కీలక ప్రకటన!

రూ.2 వేల నోట్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఏటీఎంలలో రూ.2 వేల నోట్లను నింపడం పూర్తిగా బ్యాంకుల విచక్షణపై ఆధారపడి ఉంటుందని, దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో తెలియజేశారు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వార్షిక నివేదికల ప్రకారం, మార్చి 2017 చివరి నాటికి రూ.500 మరియు రూ.2,000 నోట్ల మొత్తం విలువ రూ.9.512 లక్షల కోట్లు. 2022 మార్చి చివరి నాటికి అదే రూ.27.057 లక్షల కోట్లు అవుతుందని లిఖితపూర్వకంగా పేర్కొన్న ఆర్థిక మంత్రి.. ఏటీఎంలలో రూ.2 వేల నోట్లను నింపవద్దని ప్రభుత్వం బ్యాంకులకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదన్నారు. బ్యాంకులు తమ ఖాతాదారుల అవసరాలు, సీజనల్ ట్రెండ్స్ తదితర అంశాల ఆధారంగా ఏటీఎంలలో నోట్లను నింపుతాయని వివరించారు.

కాగా రూ.2 వేల నోట్ల చెలామణి పూర్తిగా తగ్గిపోయింది. వివిధ కారణాలతో ఈ నోట్ల చెలామణి తగ్గిన సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా ఆర్‌బీఐ కనీసం ఒక్క రూ.2000 కరెన్సీ నోటును కూడా ముద్రించలేదు. ఏటీఎంలలో ఈ నోట్లు రాకపోవడానికి ఇదే ప్రధాన కారణమని తెలుస్తోంది. కాగా, 2019లోనే రూ.2 వేల నోట్ల ముద్రణను నిలిపివేసినట్లు ఆర్బీఐ తెలిపింది. అయితే అప్పటికే చెలామణిలో ఉన్న రూ.2 వేల నోట్లు ఏమయ్యాయన్నది ప్రశ్నార్థకంగానే ఉంది.

Flash...   Good News for bank customers - RBI