SBI కస్టమర్లకు అలర్ట్‌! ప్రతి నెలా రూ.295 కట్‌ … ఎందుకో తెలుసుకోండి!

భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వేలాది బ్రాంచ్లు ఉన్న ఈ బ్యాంకుకు దేశవ్యాప్తంగా కోట్లాదిమంది ఖాతాదారులు ఉన్నారు. రకరకాల సేవల నిమిత్తం బ్యాంక్ పలు చార్జీల కింద కస్టమర్ల ఖాతాల నుంచి డబ్బులు కట్ చేస్తూ ఉంటుంది. ఒక్కోసారి డబ్బులు ఎందుకు కట్ అవుతున్నాయో తెలియక చాలా మంది మథనపడుతుంటారు.

Also Read: మార్చి 2న ఈ కారణంగానే మీ SBI సేవింగ్స్ ఖాతాలో డబ్బు కట్ అయ్యింది …!

నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (ఎన్ఏసీ వాచ్) సేవల కోసం కస్టమర్ల అకౌంట్ల నుంచి ఆ డబ్బు కట్ చేస్తున్నట్లు తెలిసింది. ఖాతాదారుల అకౌంట్ల నుంచి ఈఎంఐల ఆటోమేటిక్ చెల్లింపు కోసం ఎన్ఎసీహెచ్ ను ఉపయోగిస్తున్నారు. మీరు EMI పై ఏదైనా కొనుగోలు చేసినా లేదా రుణం తీసుకున్నా నిర్ణీత తేదీలో మీ సేవింగ్ ఖాతా నుంచి EMI మొత్తం ఆటోమేటిక్గా కట్ అవుతుంది. కాబట్టి గడువు తేదీకి ఒక రోజు ముందుగానే మీరు మీ ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేకపోయినా EMI లేకపోయినా రూ.295 పెనాల్టీ కింద కట్ అవుతుంది. ఇది కొన్నిసార్లు ఒకే సారి కాకుండా కొన్ని నెలల పాటు పెనాల్టీని కూడబెట్టి ఆపై పూర్తిగా కట్ కావచ్చు. మీరు ఈఎంఐ మొత్తానికి తగినంత బ్యాలెన్స్ అకౌంట్లో ఉంచడంలో విఫలమైతే బ్యాంక్ రూ. 250 పెనాల్టీ విధిస్తుంది. దీనికి 18 శాతం జీఎస్టీ అంటే రూ. 45 అదనం. మొత్తంగా రూ.295 మీ ఖాతా నుంచి కట్ అవుతుందన్నమాట.

Also Read:

 డబ్బుల వర్షం కురిపించే SBI స్కీమ్.

ప్రైమరీ తరగతుల( Classes 1 to 5) మార్చ్ నెల LESSON PLANS

గుండె పోటు రాకుండా ఉండాలంటే రోజుకు ఎన్ని నిమిషాలు నడవాలి..!  

Flash...   Best Camera Phones : ఈ ఫోనుల్లో కెమెరా క్వాలిటీ.. ది బెస్ట్!