SBI HOME LOANS: కస్టమర్లకు SBI బంపర్ ఆఫర్.. ఆ ఛార్జీలు లేకుండానే లోన్!
SBI Offer | దేశంలోనే అతిపెద్ద బ్యాంక్‌గా కొనసాగుతున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ఖాతాదారులకు తీపి కబురు అందించింది. రుణం తీసుకోవాలనుకునే వారికి ఇది చాలా శుభవార్త అందిస్తుంది.
దీంతో బ్యాంకు రుణం పొందిన వారికి మేలు జరుగుతుందని చెప్పవచ్చు. రుణాల కోసం బ్యాంకు ఎలాంటి ప్రయోజనాలను అందిస్తోందో ఇప్పుడు తెలుసుకుందాం.
సొంత ఇంటి కలను సాకారం చేసుకోవాలనుకునే వారికి ఎస్‌బీఐ శుభవార్త అందించింది. ప్రాసెసింగ్ చర్గెస్ లేకుండా నే గృహ రుణం పొందవచ్చని వెల్లడించారు. ఈ విషయాన్ని SBI ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. దీంతో బ్యాంకులో గృహ రుణం పొందాలనే ఆలోచనలో ఉన్న వారికి కాస్త ఊరట లభిస్తుందని చెప్పవచ్చు. అంతేకాకుండా, SBI తక్కువ వడ్డీ రేట్లకు (Low home rates in SBI)గృహ రుణాలను అందిస్తుంది.
మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గృహ రుణం పొందాలనుకుంటే, వడ్డీ రేటు 8.5 శాతం నుండి ప్రారంభమవుతుంది. ఇతర బ్యాంకులతో పోలిస్తే ఇది తక్కువ వడ్డీ రేటు అని చెప్పొచ్చు. కొన్ని బ్యాంకులు ఇంకా ఎక్కువ వడ్డీ రేట్లకు గృహ రుణాలను అందిస్తాయి. ఆర్‌బీఐ రెపో రేటు పెంపు నేపథ్యంలో బ్యాంకులు వరుసపెట్టి రుణ రేట్లను పెంచుతున్న సంగతి తెలిసిందే.