SBI Offers: మీకు SBIలో ఖాతా ఉందా? మార్చి 31 వరకు సూపర్ ఆఫర్.. మిస్ అవ్వకండి!

 SBI ఆఫర్లు: మీకు SBIలో ఖాతా ఉందా? మార్చి 31 వరకు సూపర్ ఆఫర్.. మిస్ అవ్వకండి! 

 SBI 400 రోజుల FDపై 7.1 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఇది రూ.2 కోట్ల లోపు మొత్తంపై 25 బేసిస్ పాయింట్లు పెరిగింది. మీరు ఈ ఆఫర్‌ను మార్చి 31 వరకు పొందవచ్చు.
 

ఎస్‌బీఐ తన ప్రత్యేక పథకంపై వడ్డీ రేట్లను పెంచింది. రూ.5 లక్షలు డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ తర్వాత రూ.5,40,088 పొందుతారు. ఇందులో మీకు రూ.40,088 వడ్డీ లభిస్తుంది. ఇది మీ స్థిర ఆదాయం. 

మీరు ఏదైనా శాఖ ద్వారా ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు.
మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఈ పథకాన్ని మార్చి 31 వరకు పొందవచ్చు. మీరు ఇంకా ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయకుంటే.. గడువు తేదీ కంటే ముందే ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయండి.
2 కోట్ల లోపు డిపాజిట్ల విషయానికి వస్తే, బ్యాంకు దీనిని 25 బేసిస్ పాయింట్లు పెంచింది.  

మొదటి ఏడాది మెచ్యూరిటీ FDకి 6.75 శాతం వడ్డీ లభిస్తుంది. ఇప్పుడు 0.05 శాతం పెరిగి.. ఆపై 6.80 శాతం లాభం వస్తోంది. అదే సమయంలో, ఇంతకుముందు 2 సంవత్సరాల FDపై 6.75 శాతం వడ్డీ అందుబాటులో ఉండగా, ఇప్పుడు 7 శాతం వడ్డీ లభిస్తుంది.
మూడేళ్ల మెచ్యూరిటీతో కూడిన ఎఫ్‌డీ గురించి మాట్లాడితే..

 అంతకుముందు 6.25 శాతం వడ్డీని పొందుతుండగా అది 6.50 శాతానికి పెరిగింది. అదే సమయంలో, ఐదేళ్ల మెచ్యూరిటీ ఉన్న ఎఫ్‌డిలపై గతంలో ఉన్న 6.25 శాతానికి బదులుగా ఇప్పుడు 6.50 శాతం వడ్డీ ఉంది. బ్యాంక్ కొత్త రేట్లు ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి వచ్చాయి.

Flash...   SBI Youth for India Fellowship 2022: నెలకు రూ.16,000 స్టైపెండ్‌.. రూ.50,000 అలవెన్స్‌