కాంట్రాక్టు పద్ధతిలోనే DSC – 1998 అభ్యర్థులకు పోస్టింగులు

• కాంట్రాక్టు పద్ధతిలోనే   డిఎస్సి – 1998 అభ్యర్థులకు పోస్టింగులు 

• ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల

 G.O. Ms. No. 27 Dt:15/03/2023: 1998 డిఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు కాంట్రాక్టు పద్ధతిలో నియామకం చేస్తూ ప్రభుత్వం  జీవో నెంబర్ 27న ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది.


DSC-1998 అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు పద్ధతిలో పోస్టింగు ఇచ్చింది. ఇందుకు సంబంధించిన GO 27ను పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ బుధవారం విడుదల చేశారు. డిఎస్సి – 1998కు చెందిన 4,534 మంది అభ్యర్ధులను SGT లుగా నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. 

60 ఏళ్లు దాటని అభ్యర్థులకు మాత్రమే కాంట్రాక్టు పద్ధతిలో మినిమం టైం స్కేల్ (ఎంటిఎస్) కింద నియమాకం ఉంటుందని తెలిపారు. నియామకం తరువాత NCTE  గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి ఆరు నెలల ప్రాథమిక విద్య బ్రిడ్జ్ కోర్సును రెండేళ్లలో పూర్తి చేయాలని పేర్కొన్నారు. 

వీరికి కేవలం కాంట్రాక్టు ఉద్యోగులకు వర్తించే సౌకర్యాలు మాత్రమే. వర్తిస్తాయని, రెగ్యులర్ టీచర్లకు వర్తించే ఎలాంటి ప్రోత్సాహకాలు వర్తించవని తెలిపారు.

★ 1998 డిఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు కాంట్రాక్టు పద్ధతిలో నియామకం చేస్తూ ప్రభుత్వం ఈరోజు జీవో నెంబర్ 27న ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది.

★ ఈ ఉత్తర్వుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 4,534 మంది క్వాలిఫైడ్ అభ్యర్థులు కాంట్రాక్టు పద్ధతిలో నియామకం పొందనున్నారు.

★ వీరందరికి కౌన్సిలింగ్ నిర్వహించి నియామకపు ఉత్తర్వులు ఇవ్వాలని కమీషనర్ కు  ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

DOWNLOAD GO 27 Dt:15.03.2023

Flash...   Edn News Watch.