ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. డీఏ పెంపు.. ! ఎంత పెరిగిందో తెలుసుకోండి

ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. డీఏ పెంపు.. ! ఎంత పెరిగిందో తెలుసుకోండి

 

AP  ప్రభుత్వం ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్త చెప్పింది. 2022 జనవరి 1 నుంచి పెండింగ్‌లో ఉన్న డీఏను మంజూరు చేస్తూ ఈరోజు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.ఈ మేరకు రెండు జీవోలు విడుదలయ్యాయి. ఉద్యోగులకు డీఏ మంజూరు చేస్తూ జీఓ నంబర్ 66… పింఛనుదారులకు డీఏ మంజూరు చేస్తూ జీవో నంబర్ 67 తీసుకొచ్చారు. ఈ ఏడాది జూలై 1 నుంచి జీతంతో పాటు ఈ డీఏ కూడా ఇవ్వనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో డీఏ బకాయిలను మూడు సమాన వాయిదాల్లో చెల్లించనున్నట్లు తెలుస్తోంది. కాగా, తాజాDA తో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల DA శాతం 22.75 కు పెరగనుంది.

కాగా, వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం జగన్ సోమవారం సమీక్షించారు. ఈ సమావేశంలో అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. వైద్య, ఆరోగ్య శాఖలోని రిక్రూట్‌మెంట్ బోర్డు సంబంధిత ఖాళీలను వెంటనే భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వాసుపత్రుల్లో ఎక్కడా సిబ్బంది లేరన్న మాట రాకూడదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలన్నారు. తగిన మౌలిక సదుపాయాలు మరియు మందులు కూడా ఉండేలా చూడాలి. దీంతో దాదాపుగా సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. ఒక్కో సమీక్షా సమావేశంలో ఎంత మంది సిబ్బంది ఉన్నారు? ఎన్ని ఖాళీలు ఉన్నాయో వివరాలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు.



AP ఉద్యోగులకు 2022 జనవరి 1 నుంచి ఇవ్వాల్సిన DA ను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు G.O. Ms. No 66 జారీ చేసింది.  


★ పెరిగిన 2.73% కొత్త DA ను జూలై 1, 2023 నుంచి SALARY తో కలిపి ఇస్తారు.


★ జనవరి 2022 నుంచి జూన్ 2023 వరకు ఇవ్వాల్సిన DA బకాయిలను సెప్టెంబర్, డిసెంబర్ మరియు మార్చి నెలల్లో 3 సమాన వాయిదాలలో ఈ ఆర్థిక సంవత్సరంలో చెల్లిస్తారు.


★ ఈ కొత్త DA తో కలిపి ఉద్యోగుల మొత్తం DA 22.75 శాతం అవుతుంది.

Flash...   ‘Har Ghar Tiranga’ ProgrammeS from 11th to 15th, August 2022 as part of Azadi ka Amrit Mahotsav


DOWNLAOD GO MS 66 Dt:01.05.2023

1. కొత్త DA ఎంత వస్తుందో, జులై నుండి ఎంత పేరుగుతుందో, బకాయిలు మూడు విడతాలు ఎంత వస్తాయో  మీ మొబైలు లోనే జస్ట్ ఒకే క్లిక్ లో కింది LINK  లో సులభంగా చూసుకోవచ్చు 


CLICK HERE TO KNOW YOUR DA

2. మీ హెచ్.ఆర్.ఏ సెలెక్ట్ చేసుకుని పెరిగిన కొత్త డి.ఏ తో మీ గ్రాస్ సాలరీ ఎంత వస్తుందో మీ యూనియన్ పేరుతో లేదా మీ పేరుతో రెడీ రేకోనర్ ను క్రింది లింక్ లో తయారు చేసుకోండి


DA RECKONER LINK WITH YOUR NAME