AMMA VODI 4th PHASE ON JUNE 28Tth 2023
44 లక్షల మంది తల్లుల ఖాతాల్లో అమ్మ ఒడి నిధులు- ముహూర్తం, మార్గదర్శకాలు
ఈ నెల 28న ముఖ్యమంత్రి జగన్ మానసపుత్రిక అమ్మఒడి నిధులు విడుదల చేయనున్నారు. నవరత్నాల్లో భాగంగా ఏటా విద్యా అమ్మఒడి నిధులను సీఎం జగన్ విడుదల చేస్తున్నారు. అందులో భాగంగా అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో ఈ నిధులను జమ చేస్తారు. ఈ నెల 22న లబ్ధిదారుల జాబితాను ప్రకటిస్తారు. 75 శాతం విద్యార్థుల హాజరుతోపాటు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు ఎంపిక చేసిన 43,96,402 మంది తల్లుల ఖాతాల్లో అమ్మ ఒడి నిధులు జమ చేస్తారు.
అమ్మఒడి మార్గదర్శకాలు జారీ:
అమ్మఒడి పథకం నిధుల విడుదలపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. 2022-23 సంవత్సరానికి గాను 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో సీఎం జగన్ డబ్బులు జమ చేయనున్నారు.
ఇప్పటికే ప్రభుత్వం విద్యార్థులకు 75 శాతం హాజరు తప్పనిసరి నిబంధనను అమలు చేస్తోంది. ఇప్పటి వరకు అమ్మఒడి నగదును జగన్ ప్రభుత్వం మూడుసార్లు ఇచ్చింది. నాల్గవ విడత ఇప్పుడు ఇవ్వబడుతుంది. ఈ నెల 22న లబ్ధిదారుల జాబితాను ప్రకటిస్తారు. ఆన్‌లైన్‌లో ఉంచడమే కాకుండా లబ్ధిదారుల జాబితాను కూడా స్థానిక కార్యాలయాల్లో అందుబాటులో ఉంచుతారు. అమ్మఒడి పథకం కింద ఏపీ ప్రభుత్వం మూడేళ్లలో రూ.19,617 కోట్లు అందించింది.
రూ.13 వేలు చొప్పున డిపాజిట్:
అమ్మఒడి పథకంలో తొలి ఏడాది తల్లులకు రూ.15 వేలు జమ చేశారు. గతేడాది నుంచి ప్రభుత్వం పాఠశాలలు, మరుగుదొడ్ల నిర్వహణకు అమ్మఒడి కింద ఇచ్చే రూ.15 వేలు నుంచి రూ.2 వేలు మినహాయిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ అమ్మ ఒడి నిధుల విడుదల సందర్భంగా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. గతేడాది 43,96,402 మంది తల్లులకు ఒక్కొక్కరికి రూ.13 వేల చొప్పున నిధులు అందాయి. ఈ ఏడాది కూడా అదే విధంగా రూ.13 వేలు డిపాజిట్ చేయనున్నారు. రూ.1000 డిస్ట్రిక్ట్ టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ (డీటీఎంఎఫ్)కి, మరో రూ.1000 డిస్ట్రిక్ట్ స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ (డీఎస్‌ఎంఎఫ్) ఖాతాలకు జమ చేస్తారు. పదోతరగతి తర్వాత ఇంటర్‌లో చేరిన వారికి ఈ పథకం కొనసాగుతుందని ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.
నాలుగోసారి నిధులు విడుదల:
ఐటీఐ, పాలిటెక్నిక్, ట్రిపుల్ ఐటీల్లో చేరిన వారు విద్య, వసతి పథకాలకు అర్హులని, వారికి అమ్మ ఒడి ఉండదని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. కుటుంబ ఆదాయం రూ.12 వేలు, గ్రామాల్లో రూ.10 వేల లోపు ఉన్న వారు ఈ పథకానికి అర్హులు. ట్యాక్సీ, ఆటో, ట్రాక్టర్ కాకుండా నాలుగు చక్రాల వాహనాలు ఉన్నవారు అనర్హులు. అదే సమయంలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ఈ నెల 23 నుంచి అమలు చేయాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. ఈ కార్యక్రమం ద్వారా అర్హులైనప్పటికీ పథకాలు అందని వారిని గుర్తించి వారిని లబ్ధిదారులుగా చేర్చాలని నిర్ణయించారు. అర్హులైన వారికి ఆగస్టు నుంచి పథకాలు అందించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది.
AMMMA VODI Eligibility
Those 10th class students opting for lIT/Polytechnic/lIlT and other courses which make them eligible to access Jagananna Vidya Deevena and Jagananna Vasathi Deevena will be excluded.