బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులకు శుభవార్త. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ బెల్‌లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ట్రైనీ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
బెంగళూరు: నిరుద్యోగ యువతకు శుభవార్త. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 205 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడగా.. అందులో 191 ట్రైనీ ఇంజనీర్, 14 ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 24 వరకు https://jobapply.in/bel2023JUNBNG/ వెబ్‌సైట్ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్‌లోని కొన్ని ముఖ్యాంశాలు..
Eligibility : ఏఐసీటీఏ గుర్తింపు పొందిన ఇంజినీరింగ్ కళాశాల నుంచి బీఈ/బీటెక్ పూర్తి చేసి ఉండాలి. నోటిఫికేషన్‌లో పేర్కొన్న జాబ్ కోడ్‌ల ప్రకారం సంబంధిత విభాగాల్లో కనీస అనుభవం ఉండాలి. జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. SC/ST/PWD అభ్యర్థులకు, ఉత్తీర్ణత సరిపోతుంది.
Selection Process : వ్రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయబడుతుంది. బెంగళూరు వేదికగా రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
Application Fee: ప్రాజెక్ట్ ఇంజనీర్-1 పోస్టులకు జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.472 మరియు ట్రైనీ ఇంజనీర్ పోస్టులకు రూ.177. SC/ST/వికలాంగ అభ్యర్థులకు పరీక్ష రుసుము నుండి మినహాయింపు ఉంది
Salary Details : ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల కోసం, అభ్యర్థులను మొదట మూడేళ్లపాటు ఎంపిక చేస్తారు. ఆ తర్వాత మరో ఏడాది పొడిగించే అవకాశం ఉంది. ఆ సమయంలో అభ్యర్థులకు నెలకు రూ.40 వేలు, రెండో ఏడాది రూ.50 వేలు, మూడో ఏడాది నెలకు రూ.55 వేలు అందజేస్తారు. అదే ట్రైనీ ఇంజనీర్ పోస్టులకు మొదటి రెండేళ్లకు మాత్రమే ఎంపిక చేస్తారు. ఆ తర్వాత, ప్రాజెక్ట్ అవసరాన్ని బట్టి, గరిష్టంగా ఒక సంవత్సరం పాటు పొడిగించవచ్చు. ఆ సమయంలో మొదటి ఏడాది నెలకు రూ.30 వేలు, రెండో ఏడాది నెలకు రూ.35 వేలు చొప్పున వేతనం చెల్లిస్తారు.