AP లో 12వ PRC- రిపోర్ట్‌పై డెడ్‌లైన్

AP లో 12వ PRC- రిపోర్ట్‌పై డెడ్‌లైన్

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని AP ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. 12వ పే రివిజన్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. రిటైర్డ్ IAS అధికారి డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను ఈ కమిషన్‌కు ఛైర్మన్‌గా అపాయింట్ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ కొద్దిసేపటి కిందటే G.O నంబర్ 68ని జారీ చేసింది: GO MS 68 Dt:12.07.2023

వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాధిపతులు, ఉద్యోగుల కేటగిరీలు, వారి వివరాలు, వారి సంఖ్య, ఎక్కడెక్కడ పని చేస్తోన్నారు?, వారికి అందుతోన్న జీతభత్యాలు, నగరాలు- పట్టణాల్లో వారికి చెల్లించాల్సిన హౌస్ రెంట్ అలవెన్స్ HRA , డీఏ DA.. వంటి అంశాలపై ఈ కమిషన్ అధ్యయనం చేస్తుంది. ప్రభుత్వానికి తన నివేదికను అందజేస్తుంది. దీని ఆధారంగా ప్రభుత్వం పీఆర్సీ వేతన సవరణలు చేస్తుంది

ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన వేతనాల్లో పెంపుదల, ఇంక్రిమెంట్లు, హెచ్‌ఆర్ఏ, డీఏ, ట్రావెలింగ్ అలవెన్స్.. వంటివన్నీ ఇందులో ఉంటాయి. ప్రభుత్వం ప్రస్తుతం ఉద్యోగులకు చెల్లిస్తోన్న కరవుభత్యాన్ని పేలో విలీనం చేసే ప్రతిపాదనలు కూడా ఈ కమిషన్ ముందు ఉన్నట్లు తెలుస్తోంది. ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ పైనా ఈ కమిషన్ స్టడీ చేస్తుంది. ఈ కమిషన్ తన నివేదికను అందజేయడానికి గడువు విధించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Flash...   MUNICIPAL MERGING TEACHERS TENTATIVE SENIORITY/VACANCY LISTS